బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్…ఇంట్లో రచ్చ చేసిన హిమజ

himaja creates nin sense in the house
Share Icons:

హైదరాబాద్:

బిగ్ బాస్ శుక్రవారం ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. బిగ్ బాస్ సరికొత్త ప్లానులు వేసి ఇంటి సభ్యుల మద్య చిచ్చు పెట్టారు. మొదట బిగ్ బాస్ పున‌ర్న‌వి, శ్రీముఖిల‌ని కన్ఫెష‌న్ రూంలోకి పిలిచి వారి వెనుకు మిగ‌తా వ్య‌క్తులు ఏం మాట్లాడుకుంటున్నారో వీడియో ద్వారా చూపించారు. ముందుగా పున‌ర్న‌విని పిలిచిన బిగ్ బాస్ ..వితికా, వ‌రుణ్‌,రాహుల్‌లు పున‌ర్న‌వి గురించి మాట్లాడిన ముచ్చ‌ట‌ని చూపించారు. ఇది చూసి బ‌య‌ట‌కి వ‌చ్చిన పున‌ర్న‌వి తెగ ఫీల్ అయిపోయింది.

ఆ త‌ర్వాత శ్రీముఖిని క‌న్ఫెష‌న్ రూంలోకి పిల‌వ‌గా, ఆమెకి .. పునర్నవి, రాహుల్, వితికాలు ఎలా గుసగుసలాడారో వీడియో ప్లే చేసి చూపించారు. ఈ వీడియో చూసిన శ్రీముఖి చాలా ఫీలైంది. అలీకి బాబా భాస్క‌ర్ ఎమోష‌న‌ల్ వీడియో చూపించారు. అది చూసిన అలీ ఒకింత భావోద్వేగానికి గురయ్యాడు. త‌న వ‌ల‌న మీరు ఏడ్చినందుకు బాబాకి సారీ చెప్పాడు.

అలాగే హిమజకి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. ఇష్టం వచ్చినట్లు చేస్తూ హౌస్ మేట్స్ కి మనశ్శాంతిలేకుండా చేయాలని చెప్పాడు. అలా చేస్తే ఇమ్యూనిటీ లభిస్తుందని చెబుతాడు. దీంతో హిమజ హౌస్ లో రెచ్చిపోయి రచ్చ చేసింది. ఈ క్రమంలోనే బాబా భాస్క‌ర్ అన్న ఓ మాట‌కి ప్లేట్ ఎత్తేసి నేలకేసి కొట్టేసింది. అలాగే ఎగ్‌ట్రేలో ఉన్న ఎగ్స్ అన్ని నేల‌కేసి కొట్టింది. హిమ‌జ ప్ర‌వ‌ర్త‌న చూసి ప్ర‌తి ఒక్క‌రు షాక్ అయ్యారు. అస‌లు ఏం జ‌రిగింది అని ఇంటి స‌భ్యులు అడిగే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికి స‌రైన స‌మాధానం ఇవ్వ‌కుండా చాలా దురుసుగా ప్ర‌వ‌ర్తించింది.

అటు ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్‌ స‌మ‌యంలో దానిని అడ్డుకునేందుకు హిమ‌జ చాలా ప్ర‌య‌త్నాలు చేసింది. కాని ఆమెని అలీ, రవిలు నిలువరించారు. ఇక తాస్క్‌లో హిమ‌జ విఫ‌లం అయింద‌ని బిగ్ బాస్ తెలిపారు. సీక్రెట్ టాస్క్ స‌రిగి చేయ‌ని కార‌ణంగా ఇమ్యునిటీ కూడా కోల్పోయావ‌ని బిగ్ బాస్ పేర్కొన్నారు.

Leave a Reply