మహిళనగ్నవీడియోలు- హోటల్ పై బాధితురాలి దావా

Share Icons:

న్యూయార్క్, డిసెంబర్ 06,

అమెరికాలోని పేరుపొందిన హిల్టన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్‌పై  ఓ మహిళ 100 మిలియన్ డాలర్లకు దావా వేసింది. సదరు హోటల్‌ గదిలో తాను స్నానం చేస్తుండగా రహస్య కెమెరాతో చిత్రీకరించి ఆ వీడియోను అశ్లీల వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారని  బాధితురాలు ఆరోపించారు. మూడేళ్ల క్రితం తాను  హోటల్‌లో బస చేసిన సమయంలో  ఈ చిత్రీకరణ జరిగి ఉండవచ్చుననీ,  ఆ వీడియోను ఆశ్లీల వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారని బాధిత మహిళ  పేర్కొన్నారు.

షికాగోకు చెందిన ఓ మహిళ బార్‌ పరీక్షల నిమిత్తం 2015 జులైలో న్యూయార్క్‌ వెళ్లారు. అక్కడ అల్బనీలోని హాంప్టన్‌ ఇన్‌ అండ్‌ సూట్స్‌ హోటల్‌‌లో  గది అద్దెకు తీసుకొన్నారు.  ఆ గదిలోని బాత్‌రూమ్‌లో బాధిత మహిళ స్నానం చేస్తుండగా అక్కడే ఉన్న రహస్య కెమెరాలో రికార్డైన  విషయాన్ని బాధిత మహిళ షికాగో వెళ్లిన తర్వాత గుర్తించింది. ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో ఓ వ్యక్తి నుండి బాధిత మహిళకు  ఈ మెయిల్ వచ్చింది.  అశ్లీల వెబ్‌సైట్‌ లింక్‌ను పెట్టారు. ఈ వీడియోలో ఉంది  మీరే కదూ అంటూ మెయిల్ పంపారు.

ఈ వీడియోను ఇతర సైట్లలో కూడ పోస్ట్ చేస్తాను… అలా చేయకుండా ఉండాలంటే తనకు డబ్బు కావాలని డిమాండ్ చేశారు. దీంతో బాధిత మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.  ప్రపంచంలోని అన్ని హిల్టన్ హోటల్స్ పై  100 మిలియన్ డాలర్లకు దావా వేశారు.  తమ హోటల్స్ ‌కు వచ్చే అతిథుల భద్రత, ప్రైవసీ విషయంలో  తాము సీరియస్ గా ఉంటామని  హిట్టన్ గ్రూప్ ప్రకటించింది. బాధిత మహిళకు ఇబ్బంది కల్గించిన వ్యక్తులపై చర్యలు తీసుకొంటామని ఆ సంస్థ ప్రకటించింది.

మామాట: మహిళలు ఎక్కడైనా జాగ్రత్తగానే ఉండాలోమో… 

Leave a Reply