TRENDING NOW

వైసీపీలో గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు….

వైసీపీలో గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు….
views:
141

హైదరాబాద్, 13 మార్చి:

ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరుపున గెలిచి టీడీపీలో చేరిన 22 ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేయనుంది.

పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ వారిని అనర్హులుగా ప్రకటించాలని ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు వేసిన కేసుపై ఈరోజు విచారణ జరిగింది.

దీంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అందరికీ వెంటనే నోటీసులు ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

కాగా 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలు టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఆ పార్టీలో 22 మంది చేరారు. అందులో కొందరికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు.

దీంతో వారి మీద అనర్హత వేటు వేయాలని మాజీ ఎమ్మెల్యే హైకోర్టుకు లో కేసు వేశారు. ఈ నేపథ్యంలోనే వారికి నోటీసులు ఇవ్వాలని కోర్టు నిర్ణయించింది.

అయితే పార్టీ ఫిరాయింపులపై గట్టి చట్టాలు రూపొందించాలన్న వాదనలు అప్పుడప్పుడూ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇలాంటివేవీ చట్టసభల్లో చర్చలకు నిలబడ్డం లేవు.

కాగా హైకోర్టు తాజా నోటీసులతో ఫిరాయింపులపై చిన్న కదలిక వచ్చిందనుకోవచ్చు.

మామాట: అలాంటి వారి మీద అనర్హత వేటు వేయాల్సిందే…

English summary:

The High Court notices will be issued to 22 TDP MLAs who have won the YSRCP in the last election in Andhra Pradesh.

(Visited 32 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: