టీడీపీ  ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి కి హైకోర్టు నోటీసులు

Share Icons:

అమరావతి,ఏప్రిల్ 19,

టీడీపీ నేతలకు హైకోర్టు షాకిచ్చింది. రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యంపై దౌర్జన్యం కేసులో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్ మీరాకు నోటీసులు జారీచేసింది. విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారా నోటీసులు జారీచేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. 2017 రవాణా శాఖ కమిషనర్‌ బాలసుబ్రమణ్యంపై దౌర్జన్యానికి పాల్పడిన ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించిన విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణను జూన్‌కు వాయిదా వేసింది.

గతంలో కేశినేని ట్రావెల్స్, ఆరెంజ్ ట్రావెల్స్ మధ్య వివాదం తలెత్తింది. సునీల్ రెడ్డికి చెందిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. ఐతే ఆ ఘటనపై చర్యలు తీసుకోలేదని రవాణశాఖ అధికారులతో ఎంపీ కేశినేని వాగ్వాదానికి దిగారు. రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యం ఆఫీసు నుంచి బయటకు వెళ్లిపోతున్న సమయంలో నిలదీశారు. ఆ క్రమంలో బాలసుబ్రమణ్యం గన్‌మెన్‌పై ఎమ్మెల్యే బోండా ఉమ చేయిచేసుకున్నారు.

వివాదం పెద్దదవడంతో సీఎం చంద్రబాబు కలగజేసుకున్నారు. బాలసుబ్రమణ్యానికి కేశినేని నానితో క్షమాపణలు చెప్పించారు. దాంతో అప్పటితో ఆ వివాదం సద్దుమణగింది. ఐతే మళ్లీ ఇన్నాళ్లు హైకోర్టు కలగజేసుకొని టీడీపీ నేతలకు నోటీసులివ్వడం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

మామాట: టైం బాగోకపోతే ఇలాగే అవుద్ది బాబూ

Leave a Reply