ఆనందయ్య కంటి చుక్కల (K) మందుకు కూడా హైకోర్టు అనుమతి…

Share Icons:

ఆనందయ్య కె మందుకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆనందయ్య కె మందును నిపుణుల బృందం పరిశీలించిందని.. కె మందును పంపిణీ చేయొచ్చని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. కంటి చుక్కల మందుపై రెండు వారాల్లో నివేదిక అందించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 21కి కోర్టు వాయిదా వేసింది.

ఇది ఇలా ఉండగా,  గొలగమూడిలో ఆనందయ్య మందు పంపిణీని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోజుకి 2 వేల నుంచి 3 వేలమందికి ఆనందయ్య మందు పంపిణీ చేస్తామని తెలిపారు. ఆనందయ్య విశేషమైన సేవలు అందిస్తున్నారన్నారు. అల్లోపతి మందులు వాడుతూనే ఆనందయ్య మందు తీసుకోవాలని కాకాణి సూచించారు. కేవలం సర్వేపల్లితోనే ఆనందయ్య మందు ఆగిపోదు. త్వరలోనే ఇతర జిల్లాలకూ ఆనందయ్య మందు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే కాకాణి తెలిపారు.

-మామాట విలేఖరి

 

Leave a Reply