తెలంగాణ పోలీసులపై ‘హై కోర్ట్‌’ ఆగ్రహం

Share Icons:

హైదరాబాద్, 12 ఫిబ్రవరి:

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నేరస్థులందరి చిట్టా తయారుచెయ్యాలని చేపట్టిన సకల నేరస్థుల సర్వేపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై ఆ సర్వేని ఆపాలంటూ ఆంక్ష విధించింది.

తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ రాష్ట్రంలో ఉన్న నేరస్థులు, నేర చరిత్రలు కలిగిన వారి సమాచారం సేకరించేందుకు సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే.

అయితే ఇలా సర్వే చేస్తూ చాలమందిని పలు ఇబ్బందికర ప్రశ్నలు వేస్తున్నారని ఆమధ్య  వార్తలొచ్చాయి. దీనితో హైకోర్టు పోలీసు శాఖపై ఆగ్రహించింది.

దీనితో ఇక నుండి ఈ సర్వే చెయ్యమంటూ సకల నేరస్థుల సర్వేపై తెలంగాణ పోలీసులు వెనక్కి తగ్గారు.

సర్వే సమయంలో పోలీసులు తనని ఇబ్బందికర ప్రశ్నలు అడిగారంటూ హఫీజ్ అనే వ్యక్తిలో గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అతని పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చెయ్యవలసిందిగా పోలీసు శాఖను ఆదేశించింది.

ఈ సందర్భంగా డీసీపీ (డీడీ, సీసీఎస్‌) అవినాష్ మహంతి స్వయంగా కోర్టుకు హాజరై సమగ్ర సర్వే నుండి అభ్యంతరకర ప్రశ్నలు తొలగిస్తున్నామని తెలుపారు. దీంతో న్యాయస్థానం కేసును క్లోజ్ చేసింది.

అడ్వొకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి ఇప్పటి నుంచి సర్వే చేయబోమని హైకోర్టుకు మెమో ద్వారా వెల్లడించారు.

ఇప్పటివరకు కలెక్ట్ చేసిన డేటాపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారో చెప్పాలని పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేయగా… కలెక్ట్ చేసిన డేటాపై నిర్ణయం తీసుకుంటామని ప్రకాష్ రెడ్డి తెలిపారు.

ఎవరి డేటా అయినా దుర్వినియోగం అయినట్టు భావిస్తే తమ వద్దకు రావోచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.

మామాట: అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ప్రశ్నించకూడదు…

English summary:

Police department doing Comprehensive survey of all criminals since many days. It is the massive exercise of gathering details of persons indulging in repeat offences across the State. In the past, Hafeez filed a petition in the High Court for asking difficult questions during the survey. The court ordered the police department to file a counter on the petition. Advocate General Prakash Reddy told to the High Court that the survey will not be done by now.

Leave a Reply