అప్పుడు అందుకే అలా నటించాను: రాధికా ఆప్టే

heroin radhika apte said some sensational words about movie character
Share Icons:

హైదరాబాద్, 20 జూన్:

హీరోయిన్ రాధికా ఆప్టే…సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. సినిమాలతో సమానంగా, కాంట్రవర్సీలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది ఈ నటి.

సినిమాల్లో గ్లామర్ పాత్రల్లో నటించాలన్నా, తన అభిప్రాయాలను కుండ బద్దలుకొట్టినట్లు చెప్పాలన్నా… అది రాధికాకే సొంతం అనే చెప్పాలి. అయితే ఈ అమ్మడు కొన్ని సినిమాల్లో స్థాయికి మించి గ్లామర్ పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.

అయితే అలాంటి సినిమాల్లో ఎందుకు నటించాల్సి వచ్చిందన్న ప్రశ్నకు అంతే సూటిగా సమాధానం ఇచ్చింది. ఓ ఇంటర్వూలో రాధికా మాట్లాడుతూ.. లైఫ్‌లో ఎదగాలంటే అలాంటి చిత్రాల్లో నటించక తప్పలేదని, ఇప్పుడు తనకు డబ్బు, పేరు ఉండడంతో సులభంగా అవకాశాలు వస్తున్నాయని తెలిపింది.

కానీ ఒకప్పుడు తన పరిస్థితి అలా లేదని,  అందుకే అన్ని పాత్రాల్లో నటించానని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం అన్ని సినిమాల్లో నటించడం లేదని, కథ నచ్చితేనే ఒప్పుకుంటున్నానని తేల్చి చెప్పింది. ఇలా అన్ని విషయాలను బాహాటంగా చెబుతుంది కాబట్టే రాధికా అంత సెన్సేషన్‌గా మారింది.

మామాట: రాధికా ఏదైనా ఓపెన్‌గానే చెప్పుద్ది అనుకుంటా…!

Leave a Reply