నిర్మాతపై అరిచిన అనుపమ…!

heroin anupama shouted producer dil raju
Share Icons:

హైదరాబాద్, 13 జూన్:

పలానా హీరో, హీరోయిన్ సినిమా షూటింగ్ సమయంలో గొడవ పడ్డారంటా…పలనా హీరో జూనియర్ ఆర్టిస్ట్‌ని కొట్టాడంటా… లేదా హీరోయిన్ చిత్ర యూనిట్‌పై కోపంగా అరించదట..!

ఇలాంటివి సినిమా రంగంలో ఎక్కువగా వినిపిస్తుంటాయి. మరీ ముఖ్యంగా అప్పుడప్పుడే నటిగా ఎదుగుతోన్న వారిపై ఇలాంటి రూమర్లు ఎక్కువగా వస్తుంటాయి. వీటిలో ఎంతవరకు నిజం ఉంటుందో, లేదో తెలియకపోయినప్పటికీ పుకార్లు పుట్టించేవాళ్లకు మాత్రం మంచి మసాల ఇస్తాయి.

తాజాగా మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కూడా ఇలాంటి ఆరోపణే ఎదుర్కొంటుంది. ప్రేమమ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనుపమ వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. తాజాగా ఈ భామ దిల్ రాజు నిర్మాణంలో, రామ్ హీరోగా నటిస్తున్న’హలో గురు ప్రేమ కోసమే’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ చిత్ర షూటింగ్ సమయం లో అనుపమ చిత్ర యూనిట్, నిర్మాతపై అరిచిందని సమాచారం. తనకు సపరేట్ కార్వాన్‌ను ఏర్పాటు చేయకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. అయితే ఈ విషయంపై వెంటనే కల్పించుకున్న దిల్ రాజు ప్రత్యేక కార్వాన్‌ని  ఏర్పాటు చేస్తానని అనుపమను కూల్ చేశాడని సమాచారం.

మామాట: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పుకార్లకి కొదువలేదులే…

Leave a Reply