సుమలత ఒంటరిపోరు…కానీ ఆ హీరో మద్ధతు…

Share Icons:

బెంగళూరు, 18 మార్చి:

ఎన్నికలు సమీపిస్తున్న వేళ కన్నడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మొన్నటి వరకు కాంగ్రెస్ నుండి మాండ్యా లోక్‌సభ నుండి పోటీ చేయాలని చూసిన సీనియర్ నటి సుమలత చివరికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

అయితే కాంగ్రెస్-జేడీఎస్ పొత్తులో భాగంగా మాండ్యా నుండి దేవెగౌడ మనవడు హెరి నిఖిల్ గౌడ్ పోటీకి దిగుతున్నారు. అయితే సుమలత స్వతంత్రంగా బరిలోకి దిగుతుండటంతో…. జేడీఎస్ పార్టీలో అలజడి నెలకొంది. ఆ పఓగా ఆమెకు సపోర్ట్ గా కే‌జి‌ఎఫ్ స్టార్ హీరో యాష్ నిలిచారు.  

కానీ జేడీఎస్ కాంగ్రెస్ మిత్రపక్షాలు మాండ్యా టికెట్ కాంగ్రెస్ అభ్యర్థికి ఇవ్వకుండా కుమారుడికి ఇవ్వడంతో సుమలత మరో పార్టీలోకి వెళ్లాలని అనుకున్నారు. ఇటీవల బీజేపీతో చర్చలు జరిపినప్పటికీ ఆమె ఫైనల్‌గా ఒంటరి పోరుకు సిద్దమవుతున్నట్లు చెప్పారు. యాష్ తో పాటు దర్శన్ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్‌తో పాటు ఇతర సినీ ప్రముఖులు సుమలతకు మద్దతు పలుకుతున్నారు. 

 మామాట: దేవెగౌడ మనవడికి సుమలత చెక్ పెట్టేలా కనిపిస్తున్నారు..

Leave a Reply