నానీ, శ్రీ రెడ్డిల వివాదం మధ్యలోకి హీరో విశాల్…

Hero vishal supports Nani in SRi Reddy issue
Share Icons:

హైదరాబాద్, 13 జూన్:

గత కొద్ది కాలంగా నానీ, శ్రీ రెడ్డి ల మధ్యలో జరుగుతున్న వివాదం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంలో నానీ భార్య కూడా స్పందించి తన భర్తకి మద్దతు తెలిపింది.

తాజాగా వీరివురి వివాదం గురించి తమిళ హీరో విశాల్  స్పందించడం విశేషం. నానీపై శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదంటున్నాడు విశాల్.

‘చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఒప్పుకుంటాను. కానీ, ప్రముఖ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడం కరెక్టు కాదు.” అని శ్రీరెడ్డి గురించి వ్యాఖ్యానించాడు.

“నాకు నాని గురించి తెలుసు. అతను నాకు మంచి స్నేహితుడు, వ్యక్తిగత కారణాల రీత్యా నానికి మద్దతు తెలపడం లేదు. నానిపై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు వివాదాస్పదమైనవి. మహిళల పట్ల నాని ఎంత మర్యాదగా ప్రవర్తిస్తారో అతని గురించి తెలిసిన వారందరికీ ఈ విషయం తెలుసు.” అంటూ నానీ వ్యక్తిత్వం గురించి మాట్లాడారు.

“శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉంటే ఆధారాలు చూపించాలి. కేవలం, వారి పేర్లు బయటపెడితే సరిపోదు” అని శ్రీరెడ్డి చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపాడు.

“శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను చూస్తుంటే ఇతరులపై తన ఇష్టం వచ్చినట్టు టార్గెట్ చేస్తోందని అర్థమవుతోంది. భవిష్యత్‌లో నన్ను కూడా శ్రీరెడ్డి టార్గెట్ చేస్తుందేమో!” అని చెప్పుకొచ్చాడు.

“ఆడిషన్ పేరిట వారిని మోసం చేయడం తప్పు. మన దేశంలో లైంగిక వేధింపుల నిరోధానికి సంబంధించి సరైన చట్లాల్లేవు. ఏ మహిళ అయినా ఇతరులపై ఆరోపణలు చేస్తే దానిని మాత్రమే చట్టం పరిగణనలోకి తీసుకుంటోంది. ఆరోపణలు చేసే వారికే మద్దతుగా నిలుస్తోంది. ఇది సబబు కాదు’ అని విశాల్ అభిప్రాయ పడ్డారు.

మామాట: ఇక ఈ విషయంపై శ్రీరెడ్డి ఎంత రచ్చ చేస్తుందో…

Leave a Reply