‘టెంపర్’ చూపిస్తానంటున్న విశాల్…

hero vishal remake the ntr temper movie
Share Icons:

చెన్నై, 7 జూన్:

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, పూరీజగన్నాథ్ దర్శకత్వంలో 2015లో విడదలైన ‘టెంపర్’ సినిమా ఎంతటి విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు.

నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఎన్టీఆర్ నటన ఈ సినిమాకే హైలెట్‌గా నిలిచింది.

తెలుగులో ఎన్టీఆర్, పూరి కెరీర్లలో బెస్ట్‌గా నిలిచిన ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాను రణవీర్ సింగ్ హీరోగా హిందీలో ‘సింబా’ పేరుతో రీమేక్ మొదలుపెట్టారు. ఈ సినిమాకు రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు.

అయితే హిందీలో విడదులవ్వక ముందే ఈ సినిమాను తమిళంలో హీరో విశాల్ రీమేక్ చేయనున్నాడు.

‘అభిమన్యుడు సినిమా ప్రమోషన్‌లో భాగంగా విశాల్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు.

‘టెంపర్‌ సినిమాని తమిళంలో రీమేక్ చేయాలనుకుంటున్నానని, ఎందుకంటే ఈ సినిమా ఆడవారిపై జరుగుతోన్న అన్యాయాలను ప్రశ్నించేలా ఉందని చెప్పాడు.

తన అభిప్రాయం ప్రకారం సినిమా ద్వారా సామాజిక అంశాలను ప్రశ్నించడం ఎంతో ముఖ్యమైందని చెప్పుకొచ్చాడు తెలుగులో సంచలన విజయం సాధించిన టెంపర్ ఇతర భాషల్లో ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.

మామాట: మరి విశాల్ ‘టెంపర్’ ఎలా ఉంటుందో?

Leave a Reply