తారక్..ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసేస్తాడు…

Share Icons:

హైదరాబాద్, 1 డిసెంబర్:

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి హీరో సుమంత్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తను నటించిన సుబ్రహ్మణ్యపురం’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా..ఓ ఇంటర్వ్యూలో సుమంత్‌కి ఎన్టీఆర్ గురించిన ప్రశ్న ఆయనకి ఎదురైంది. అందుకు సుమంత్ తనదైన శైలిలో స్పందిస్తూ .. తారక్‌తో తనకు ఎంతో సాన్నిహిత్యం వుందని, తారక్‌ని ముద్దుగా ఆయనని ‘బావా’ అని పిలుస్తుంటానని చెప్పాడు. అలాగే  ఎలాంటి పాత్రను ఇచ్చినా తారక్ ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేస్తాడని, ఆయన చేయలేని పాత్రంటూ ఉండదు’ అంటూ సమాధానమిచ్చాడు.    

ఇదిలా ఉంటే సుబ్రహ్మణ్యపురం’ సినిమా ఈ నెల 7వ తేదీన విడుదల కానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, ఈ సినిమా ప్రమోషన్స్ లో సుమంత్ బిజీ అయ్యాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో తాను పోషించిన పాత్ర, ఇంతవరకూ తాను చేసిన పాత్రలకి పూర్తి భిన్నంగా ఉంటుందని అన్నాడు. ఈ సినిమా తనకి తప్పకుండా సక్సెస్‌ను తెచ్చిపెడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.

మామాట: టాలీవుడ్‌లో ఒకో హీరోకి ఒకో టాలెంట్ ఉంది…

Leave a Reply