TRENDING NOW

చంద్రబాబుపై బీజేపీ మరోసారి పంజా విసరబోతోంది…

చంద్రబాబుపై బీజేపీ మరోసారి పంజా విసరబోతోంది…

విజయవాడ, 8 సెప్టెంబర్:

కొన్ని నెలల క్రితం ఆపరేషన్ గరుడ అంటూ వార్తల్లోకి ఎక్కిన హీరో శివాజీ మరోసారి సంచలన విషయాలు చెప్పాడు. ఈరోజు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ…కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఓ జాతీయ స్థాయి రాజ్యాంగబద్ధ సంస్థ నుంచి సోమవారం నాడు చంద్రబాబుకు నోటీసులు అందజేయబడతాయని చెప్పారు. నిన్న అర్ధరాత్రి తనకు ఢిల్లీ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చిందని, ఆ ఫోన్ ద్వారా తనకు ఈ విషయం తెలిసిందని చెప్పారు.

Life Homepathy
treefurn AD

మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న కేంద్ర ప్రభుత్వం.. అందుకోసం రూపొందించిన ఆపరేషన్ గరుడను ఈ విధంగా మరో రూపంలో అమలు చేయబోతున్నారంటూ తెలిపారు.

అయితే ప్రస్తుతం విషయం బయటపడింది కాబట్టి.. నాలుగు రోజులు ఆలస్యమైనా నోటీసులు ఇస్తారని చెప్పారు. ఇక తనకు చంద్రబాబు అయినా, జగన్ అయినా ఒకటేనని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే తనకు ముఖ్యమని శివాజీ అన్నారు. ఒక ముఖ్యమంత్రి వల్ల తమకు జాతీయ స్థాయిలో ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందనే భావనతో, ఆయన అడ్డుతొలగించేందుకు మరోసారి బీజేపీ పంజా విసురుతోందని మండిపడ్డారు.

ఒకవేళ ఎవరైనా తప్పు చేసి ఉంటే వారిని శిక్షించేందుకు ఇంత సమయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఒక ముఖ్యమంత్రిని టార్గెట్‌గా చేసుకుని రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టడం ముమ్మాటికీ భవిష్యత్ తరాలను నాశనం చేయడమేనని ఆయన మండిపడ్డారు.

మామాట: మరి శివాజీ వ్యాఖ్యల్లో నిజమెంతో?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: