TRENDING NOW

కోహ్లీపై సీరియస్‌ అయిన హీరో సిద్ధార్థ్…

కోహ్లీపై సీరియస్‌ అయిన హీరో సిద్ధార్థ్…
Views:
36

ముంబై, 8 నవంబర్:

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తాజాగా తన సొంత యాప్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే  దీనిపై ఓ అభిమాని స్పందిస్తూ కోహ్లిని అనవసరంగా ఎక్కువ చేసి చూపిస్తున్నారని, అతని బ్యాటింగ్‌లో తనకు ఎలాంటి ప్రత్యేకత కనిపించదని అన్నాడు. అలాగే అతని కంటే ఇంగ్లిష్, ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఆటే నచ్చుతుందని కామెంట్ చేశాడు.

ఇక అభిమాని అన్న ఈ వ్యాఖ్యలపై కోహ్లి తీవ్రంగా స్పందించాడు. అలాంటప్పుడు నువ్వు ఇండియాలో ఉండాల్సిన అవసరం లేదు.. వెళ్లి అక్కడే ఉండు. ఈ దేశంలో ఉంటూ ఆ దేశాలను ఎందుకు పొగుడుతున్నావు? ముందు నీ పద్ధతి మార్చుకో అంటూ క్లాస్ పీకాడు.

ఈ నేపథ్యంలోనే కోహ్లీ చేసిన వ్యాఖ్యలను హీరో సిద్ధార్థ్ తప్పుబట్టాడు. కోహ్లీ తాను చేసిన వ్యాఖ్యల పట్ల ఒక్కసారి పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. భవిష్యత్‌లో మళ్లీ మాట్లాడేటప్పుడు ద్రావిడ్ ఏం చెప్పాడో గుర్తుచేసుకోవాలని సిద్ధార్థ్ కోహ్లీకి సూచించాడు. టీం ఇండియా కెప్టెన్ ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేయడమేంటని సిద్ధార్థ్ ఫైర్ అయ్యాడు.

అదేవిధంగా చాలా మంది ప్రముఖులు తమకు నచ్చే విషయాలే వినాలన్న ఓ రకమైన బుడగను తమ చుట్టూ ఏర్పర్చుకుంటారు. ఇది మంచిది కాదు. ఇదే భిన్నాభిప్రాయాలకు దారి తీస్తుంది అని ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్ష భోగ్లే ట్విటర్‌లో తన అభిప్రాయాన్ని చెప్పాడు.

మామాట: అలాంటప్పుడు అభిమాని సొంత అభిప్రాయాన్ని కోహ్లీతో పంచుకోవాల్సిన అవసరం లేదేమో…

(Visited 42 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: