వరసలు తెలుసుకుని వార్తలు రాయండి….

Hero Raj Tarun serious on media
Share Icons:

హైదరాబాద్, 19 జూలై:

సోషల్ మీడియా వాడకంలోకి వచ్చాక ప్రపంచంలో జరిగే ఏ విషయమైన సెకనులలో తెలిసిపోతుంది. ఇక ఇందులో మంచి అయిన, చెడు అయిన త్వరగా వైరల్ అయిపోతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఆంగ్ల పత్రిక చేసిన తప్పు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

అది కాస్తా మన టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ కంటపడటంతో ఓ వార్త పత్రికపై సీరియస్ అయ్యాడు. రాజ్ తరుణ్ అంతలా సీరియస్ అవ్వడానికి గల కారణం ఏమిటంటే?

దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు క్రిష్ ‘ఎన్టీఆర్‌’ సినిమా రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులోఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ నటిస్తుండగా, ఎన్టీఆర్‌ భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ నటిస్తోంది.

అయితే ఆమె తెలుగులో నటిస్తోన్న తొలి తెలుగు సినిమా కావడంతో బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్ మీడియా వర్గాలు ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. ఈ క్రమంలో ఓ ఆంగ్ల దినపత్రిక ఎన్టీఆర్‌ బయోపిక్‌కు సంబంధించి వార్తను ప్రచురించింది. ఇందులో సీనియర్ ఎన్టీఆర్‌ భార్యగా విద్యాబాలన్ అని రాయడానికి బదులుగా జూనియర్ ఎన్టీఆర్‌కు భార్యగా అని రాశారు. ఇక ఇదే వార్తను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.

ఈ విషయాన్ని గ్రహించిన రాజ్ తరుణ్ ‘బసవతారకం’ గారు జూనియర్ ఎన్టీఆర్‌కు నానమ్మ అవుతారు. బయోపిక్ లో విద్యాబాలన్ సీనియర్ ఎన్టీఆర్‌కు భార్యగా నటిస్తున్నారు. దయచేసి ఇలాంటి వార్తలు రాసే ముందు జాగ్రత్తగా తెలుసుకొని రాయండి. థాంక్స్’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మామాట: సరిగానే చెప్పారు…

Leave a Reply