అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన హీరో కొత్త బైకులు…

Share Icons:

 

ఢిల్లీ, 2 మే:

ప్రముఖ  మోటార్స్ సైకిల్స్ దిగ్గజం ‘హీరో మోటో కార్ప్స్’ భారత్ మార్కెట్లోకి రెండు సరికొత్త మోడల్ బైకులని విడుదల చేసింది. ‘హీరో ఎక్స్ ప్లస్ 200’, ‘హీరో ఎక్స్ పల్స్ 200 టీ (టూరర్) పేరిట ఇవి విడుదల అయ్యాయి.

అయితే ఈ రెండు బైక్స్‌లోనూ గతేడాది హీరో మోటో కార్ప్స్ ఆవిష్కరించిన హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ మోడల్ బైక్‌లో వాడిన ఇంజిన్‌నే వినియోగిస్తున్నారు. అందులో వాడిన ఇంజిన్ 199.6సీసీ, ఎయిర్ కూల్డ్, 4- స్ట్రోక్, 2- వాల్వ్‌తోపాటు  18.3 హెచ్పీ, 17.1 ఎన్ఎం ఆఫ్ టార్చి సామర్థ్యం గల సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. అలాగే ఎక్స్‌పల్స్ 200 బైక్‌కు ‘నాబీ టైర్లు’, 825 ఎంఎం ఎత్తుపై సీటు అమర్చారు. 21 అంగుళాల ఫ్రంట్, 18 అంగుళాల రేర్ వీల్స్ కలిగి ఉంటుంది.

అటు  హీరో ఎక్స్ పల్స్ 200టీ బైక్ లోనూ వీల్స్, సీటింగ్ అమర్చారు. హీరో ఎక్స్ పల్స్ 200టీ సేఫ్టీ అండ్ కన్వీయన్స్ ఫీచర్లు కలిగి ఉంటుంది. ఇక వీటిల్లో సింగిల్ చానెల్ ఏబీఎస్, ఎల్ఈడీ హెడ్ అండ్ టెయిల్ లాంప్స్, డిజిటల్ స్పీడో మీటర్, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నేవిగేషన్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ రెండు మోడల్ బైక్‌లు రూ.1.05 లక్షల నుంచి రూ.1.15 లక్షలు పలుకుతాయి.

మామాట: మరి సేల్స్ ఏ మేర అవుతాయో చూడాలి…

 

Leave a Reply