హీరో నుంచి వస్తున్న మాస్ట్రో ఎడ్జ్ 125….

Share Icons:

ముంబై, 14 మే:

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటో కార్ప్స్ నుంచి 125 సీసీ స్కూటర్ సెగ్మెంట్‌లో వెలువడుతున్న స్కూటర్ హీరో మాస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్. స్పోర్టీ డిజైన్‌తో రూపుదిద్దుకున్న హీరో మాస్ట్రో 125 స్కూటర్ పూర్తిగా యువతరం కోసమేనని కంపెనీ ప్రకటించింది. దీని ధర సుమారు రూ. 57 వేల వరకు ఉండొచ్చు. 

ఇందులో 125 సీసీ ఎనర్జీ బూస్ట్ మేకర్ 6750 ఆర్పీఎం వద్ద 8.7 బీహెచ్పీ, 5000 ఆర్పీఎం వద్ద 10.2 ఎన్ఎం టార్చ్ అందిస్తుంది. న్యూ హీరో మాస్ట్రో స్కూటర్ కంపెనీ ఐ3ఎస్ (ఐడిల్-స్టాప్-స్టార్-సిస్టమ్) టెక్నాలజీతో రూపుదిద్దుకున్నది. ఇది ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్, బాత్ డ్రమ్ అండ్ డిస్క్ వారియంట్లు కలిగి ఉంటుంది. 

డైమండ్ కట్ కాస్ట్ వీల్స్, సిగ్నేచర్ ఎల్ఈడీ టెయిల్ లాంప్, ఫ్రొస్ట్ వింకర్స్, షార్ప్ ఫ్రంట్ కవర్, అప్రోన్, స్లీక్ రేర్ కౌల్ తదితర ఫీచర్లు జత కలిపారు. ఇంకా ఎక్స్ టర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్, రిమోట్ కీ ఓపెనింగ్, మొబైల్ చార్జింగ్ పోర్ట్, బూట్ లాంప్ తదితర ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇంకా మ్యాట్ టెక్నో బ్లూ, మ్యాట్ రెడ్, మ్యాట్ బ్రౌన్, మ్యాట్ వెర్నియర్ గ్రే కలర్స్‌లో హీరో మాస్ట్రో ఎడ్జ్ 125 లభిస్తుంది. 

మామాట: బడ్జెట్ ధరలో మంచి స్కూటర్..

Leave a Reply