గ్యాంగ్ లీడర్ ట్రెండ్ సెట్ చేస్తుందంటున్న కార్తికేయ…ప్రభాస్ ఇష్టమంటున్న పాయల్

hero kartikeya comments om gang leader and heroion payal comments on prabhas
Share Icons:

హైదరాబాద్:

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో, విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గ్యాంగ్ లీడర్. ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా నటించిన ఈ సినిమా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో ఆర్‌ఎక్స్ 100 హీరో కార్తికేయ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ప్రమోషన్ లో బిజీగా ఉన్న కార్తికేయ ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలని వెల్లడించాడు.

ఈ సినిమాతో విక్రమ్ కుమార్ గారు కొత్త జోనర్ ను క్రియేట్ చేశారు .. కొత్త ట్రెండ్ ను సెట్ చేశారనడంలో అతిశయోక్తి లేదు. ‘జెర్సీ’కి మించిన సక్సెస్ ఈ సినిమాతో నానీకి దక్కుతుందనడంలో సందేహం లేదు” అని చెప్పుకొచ్చాడు.

ప్రభాస్ ఇష్టం: పాయల్

ఆర్‌ఎక్స్ 100 సినిమాతో సంచలనం సృష్టించిన హాట్ భామ పాయల్ రాజ్ పుట్ నటించిన తాజా చిత్రం ఆర్‌డి‌ఎక్స్ లవ్. అలాగే ఈ అమ్మడు వెంకటేష్-నాగచైతన్య కాబినేషన్ లో వస్తున్న ‘వెంకీమామ’, రవితేజ హీరోగా వస్తున్న ‘డిస్కోరాజా’ సినిమాల్లో అవకాశం కొట్టేసింది. అయితే పాయల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

‘ప్రభాస్ .. విజయ్ దేవరకొండలలో మీకు ఎవరు ఎక్కువ హాట్ గా అనిపిస్తారు? ఎవరితో కలిసి నటించాలని వుంది?’ అనే ప్రశ్న ఎదురైంది. అందుకు పాయల్ స్పందిస్తూ .. “నాకు ప్రభాస్ అంటే ఎక్కువ ఇష్టం .. ఆయనలో ఏదో స్పార్క్ వుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ .. సహజంగా అనిపించే స్టైల్ అంటే నాకు మరింత ఇష్టం. ఆయనతో కలిసి నటించాలని వుంది’ అని చెప్పింది.

అనుష్క నిశ్శబ్దం…

అనుష్క ప్రధాన పాత్రధారిగా ‘నిశ్శబ్దం’ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అంతా కూడా దాదాపు విదేశాల్లోనే జరుగుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి అనుష్క ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. ‘సాక్షి’ అనే ఒక చిత్రకారిణిగా ఈ పోస్టర్లో ఆమె కనిపిస్తోంది. అనుష్క లుక్ డిఫరెంట్ గా వుంది. విభిన్నమైన కంటెంట్ కావడంతో, అంతా ఈ సినిమా పట్ల ఆసక్తిని చూపుతున్నారు. మాధవన్ .. మైఖేల్ మాడిసన్ .. అంజలి .. షాలినీ పాండే .. సుబ్బరాజు ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి, హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Leave a Reply