అత్యధిక మైలేజ్ ఇచ్చే హీరో కొత్త బైక్ వచ్చేసింది…

Hero HF Deluxe BS6 Self Start Alloy Wheel
Share Icons:

ముంబై: సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే బైకులని అందిస్తున్న హీరో మోటో మోటో కార్ప్ భారత్ మార్కెట్లో మరో సరికొత్త బైక్‌ని విడుదల చేసింది. హీరో హెచ్ఎఫ్ డీలక్స్‌ పేరిట ఈ బైక్‌ను విడుదల చేశారు. మొత్తం రెండు వేరియంట్లలో  విడుదల చేసిన ఈ బైక్‌ ప్రారంభ ధర రూ. 55,925 – రూ. 57,250గా కంపెనీ నిర్ణయించింది.

ఇక త్వరలో హీరో అన్ని మోడళ్లను బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేస్తామని హీరో మోటో కార్ప్ ఒక ప్రకటనలో తెలింది. ఈ కొత్త హెచ్‌ఎఫ్ డీలక్స్ మోడల్‌లో బీఎస్‌-6 100సీసీ ఫ్యూయల్‌ ఇన్‌జెక్షన్‌ ఇంజిన్‌ను అమర్చారు. దీనికి పది సెన్సార్లతో ఎక్స్‌సెన్స్‌ అనే టెక్నాలజీని జోడించారు.

ఈ బైక్ 8,000 ఆర్పీఎం వద్ద 7.94 బీహెచ్పీ శక్తిని, 6,000 ఆర్‌పీఎం వద్ద 8.05 ఎన్‌ఎం టార్చిని విడుదల చేస్తుంది. పాత మోడల్ కంటే బీఎస్-6 హెచ్‌ఎఫ్ డీలక్స్‌ తొమ్మిది శాతం అధిక మైలేజీని ఇస్తుందని హీరో మోటోకార్ఫ్ తెలిపింది. ఇతర మోడల్ మోటారు సైకిళ్లలో మాదిరిగానే డీలక్స్ హెచ్ఎఫ్ బైక్ లోనూ ఐడిల్ స్టార్ట్‌ స్టాప్‌ సిస్టం (ఐ3ఎస్‌)ని అమర్చారు.

కవాసాకి కొత్త బైక్

కవాసాకి మోటార్ 2020 కవాసాకి జెడ్ 900 బైక్ లాంచ్‌తో తొలి బీఎస్ 6 కంప్లైంట్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. 2020 కవాసాకి జెడ్ 900 ధర ₹ 8.50 లక్షల నుండి 9 లక్షల మధ్య ఉంటుంది. బిఎస్ 4 మోడల్‌తో పోలిస్తే దీని ప్రస్తుత ధర పెరిగి 7.69 లక్షలకు రిటైల్ లభ్యమవుతుంది.

2020 కవాసాకి జెడ్ 900 బిఎస్ 6 లుకింగ్‌లో పెద్దగా ఎలాంటి మార్పులు లేవు.

అయితే, ఇప్పుడు ఇది ఫోర్ రైడింగ్ మోడ్‌లు – స్పోర్ట్, రెయిన్, రోడ్ అండ్ మాన్యువల్, మూడు-లెవెల్ ట్రాక్షన్ కంట్రోల్ తో పాటు రెండు పవర్ మోడ్‌లతో కూడి వస్తుంది.

 

Leave a Reply