TRENDING NOW

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా చేస్తారా…?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా చేస్తారా…?

హైదరాబాద్, 14 ఫిబ్రవరి:

యంగ్ హీరో నవీన్ చంద్ర నటించిన ‘హీరో హీరోయిన్’ సినిమా టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ టీజర్‌లో ఒక సీన్‌లో “మా ఎన్టీఆర్ సినిమానే పైరసీ చేస్తావా అంటూ హీరో చొక్కా పట్టుకుంటారు ఫ్యాన్స్… దానికి హీరో నెక్స్ట్ వీక్ రామ్ చరణ్ సినిమా రిలీజవుతుంది.. ఇంకా ఎక్కువ పైరసీ చేస్తా అంటాడు. ఇక వెంటనే తారక్ ఫ్యాన్స్ హీరోని మెచ్చుకుంటూ తమవాడిలా చూస్తారు.

అయితే ఈ సీన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య గొడవ పెట్టేలా ఉంది. ఇక దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కోపంగా ఉన్నారు. వేరే హీరో సినిమాని పైరసీ చేస్తే దానికి సహకరించేలా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని చూపెట్టడంపై సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.

treefurn AD
Life Homepathy

ఇక ఈ వివాదాస్పద సన్నివేశంపై హీరో నవీన్ కూడా స్పందించాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల్లో అలాంటివాళ్లు చాలా మంది ఉన్నారంటున్నాడు. ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ మధ్య గొడవ పెట్టే ఉద్దేశం తమకు లేదని, అలాంటివాళ్లు కూడా ఉన్నారని చెప్పడం కోసమే ఆ సీన్ పెట్టినట్లు వెల్లడించాడు. ప్రస్తుతం అభిమానుల మధ్య జరుగుతున్నదే  చూపించామని, అందులో తప్పేముందని ప్రశ్నిస్తున్నాడు.

అసలు ఎన్టీఆర్, చరణ్ కలిసి సినిమా చేస్తారనే విషయం యూనిట్‌కి తెలియదని, RRR సినిమా సెట్ కాక ముందే ఈ సినిమా షూటింగ్ పూర్తైనట్లు తెలిపారు.

మామాట: మరి ఈ టీజర్‌పై ఎలాంటి వివాదాలు వస్తాయో చూడాలి….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: