ప్రపంచ వారసత్వ సంపద లో రామప్ప దేవాలయానికి చోటు!

Share Icons:
  •  ఎల్లుండి పారిస్‌లో ఎంపిక కమిటీ సమావేశం

తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కే  అవకాశం ఉందని తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. రామప్పను వరల్డ్ హెరిటేజ్‌ సైట్‌గా గుర్తించాలన్న భారత్ వినతులను ఈ కమిటీ పరిశీలించిన అనంతరం ప్రకటించే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

రామప్ప దేవాలయం చరిత్ర :- ఓరుగల్లు నేలిన రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం రామప్ప దేవాలయం. రామప్ప దేవాలయం  హైదరాబాదు నగరానికి సుమారు 230 కి.మీ.దూరంలో ఉంది . కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు కి 70 కి.మీ.దూరంలో  ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని  వ్యవహరించడం.  జరుగుతుంది. ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది. ఇది ఇప్పటికి వేల ఎకరాల పంటకు ఆధారంగా ఉంది.పాలంపేట చారిత్రత్మాక గ్రామం. కాకతీయుల పరిపాలనలో 13-14 శతాబ్ధాల మధ్య వెలుగొందింది.[1] కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించాడు.

రామప్ప అనే శిల్పి పేరుతోనే రామప్ప దేవాలయం:- దేవాలయాన్ని క్రీస్తు శకం 1213లో గణపతి దేవుడుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు కట్టించాడు. మధ్యయుగానికి చెందిన ఈ శివాలయం ఆలయంలో ఉన్న దైవంపేరు మీదుగా కాక. ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని కూడా వ్యవహరిస్తారు. ఈ దేవాలయంలో ప్రధాన దైవం రామలింగేశ్వరుడు. విష్ణువు ఆవతారం రాముడు, శివుడు కలిసి ప్రధాన దైవంగా ఉన్న దేవాలయం ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది.   ఈ ఆలయం తూర్పు దిశాభిముఖంగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగాన మూడు వైపుల ప్రవేశ ద్వారం కలిగి మహామండపం ఉంది.

 

 

రామప్ప గుడిలో శిల్ప కళా చాతుర్యం:- రామప్పగుడి ఆలయ నిర్మాణంలోని చిత్ర కౌశలం, శిల్ప నైపుణ్యం వర్ణిచనలవికానివి. ఈ కాకతీయ శిల్పచాతుర్యమంతా, ఇన్నేళ్ళు గడిచినా, ఈ నాటికి చూఫరులకు అమితానందాన్ని కలిగిస్తూంది. భరత నాట్య శాస్త్రమంతా మూర్తీ భవించి, స్థంబాలమీదా, కప్పులమీదా, కనబడుతుంది.రామప్ప గుడిలోని విగ్రహాలు, స్థంబాలపై ఉన్న శిల్పాలు ముఖ్యంగా దేవాలయ మంటపంపై కోణాల్లో నాలుగు పక్కలా పెద్ద నల్లారాతి నాట్య కత్తెల విగ్రహాలు అతి సుందరమైనవి. ఆ విగ్రహాల సొమ్ముల అలంకరణాలు, వాటి త్రిభంగీ నాట్య భంగిమలూ శిల్పకారుల్నే సమ్మోహితుల్ని చేస్తున్నాయి. దేవాలయం లోని స్థంబాలపై నాట్య భంగిమలు మృదంగాది వాద్యముల వారి రేఖలు చిత్రించబడి ఉన్నాయి. జాయన సేనాని రచించిన నృత్తరత్నావళిలో ఉదహరించిన నాట్యశిల్పమంతా రామప్ప గుడిలో తొణికిసలాడుతూ ఉంది.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply