రాజ్యసభలో ట్విస్ట్: ఆ నలుగురుకే పదవులు?

Share Icons:

అమరావతి: ప్రధానమంత్రి మోడీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ భేటీ తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఓ వైపు వైసీపీ కేంద్ర కేబినెట్‌లో చేరుతోందన్న వార్తలు వస్తుండగానే వైసీపీ రాజ్యసభ సభ్యులు ఎంపిక మరో సంచలనం సృష్టిస్తుంది.

తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ దెబ్బకు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయిన బీజేపీ ఇప్పుడు రాజ్యసభలో మద్దతు కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా దక్షిణాది నుంచి వైసీపీ మద్దతు కోరుతోంది. మొన్న ప్రధానితో భేటీ సందర్భంగా ఈ అంశం కూడా జగన్‌తో బీజేపీ చర్చించినట్లు సమాచారం. తాజాగా అమిత్ షాను కలుస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

బీజేపీ ఏదైనా బిల్లులు పాస్ చేయించాలంటే లోక్‌సభలో సులభంగా పాస్ అవుతున్నప్పటికీ రాజ్యసభలో మాత్రం తక్కువ సంఖ్యాబలం ఉండటంతో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇక అలాంటి ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు మోడీ-షా-నడ్డా టీం మాస్టర్‌ ప్లాన్‌తో ముందుకు అడుగులు వేస్తోంది. ఏపీలో జనసేనతో పొత్తు పెట్టుకున్నప్పటికీ పెద్దగా లాభం లేదని భావిస్తున్న బీజేపీ రాజ్యసభలో గట్టెక్కాలంటే వైసీపీని మచ్చిక చేసుకుంటే బాగుంటుందన్న భావనలో బీజేపీ ఉంది. ఇక రాజ్యసభ సీట్ల విషయానికొస్తే ఏపీలో ఏప్రిల్ 9వ తేదీతో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న నలుగురు సభ్యులు పదవీకాలం ముగుస్తుంది. టీఆర్‌ఎస్‌కు చెందిన కే. కేశవరావు, కాంగ్రెస్‌కు చెందిన ఎంఏ ఖాన్, సుబ్బిరామిరెడ్డి, తోటసీతారామలక్ష్మీలు పదవీ విరమణ పొందనున్నారు.

ఇక నాలుగు సీట్లను భర్తీ చేయాల్సి ఉండగా రాజ్యసభకు వైసీపీ నుంచి పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మాజీ ఛైర్మెన్ మాజీ వ్యవస్థాపకులైన అయోధ్య రామిరెడ్డి, ఇటీవలే టీడీపీ నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్న బీద మస్తాన్ రావు, సినీనటులు మాజీ కేంద్రమంత్రి చిరంజీవి , మరో సినీటుడు మోహన్ బాబు లేదా న్యాయరంగానికి చెందిన మరో ప్రముఖ వ్యక్తుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఓ నామినేటెడ్ పోస్టులో ఉన్న ఓ ప్రముఖ వ్యక్తి ఈ న్యాయరంగానికి చెందిన వ్యక్తిని రాజ్యసభకు పంపాల్సిందిగా సీఎం జగన్‌కు సూచించారని సమాచారం.

 

Leave a Reply