TRENDING NOW

పెరుగుతున్న వరద మృతులు

పెరుగుతున్న వరద మృతులు

తిరుపతి, ఆగష్టు 10,

మరి కొన్ని రోజుల్లో మనం 73వ స్వతంత్ర్యదినోత్సవం జరుపుకోబోతున్నాం. మనల్ని మనం పాలిచుకోవడానికి ప్రజాప్రభుత్వాలను ప్రతి ఐదేళ్లకొకసారి ఇంతకాలంగా ఎన్నుకుంటూనే ఉన్నాం.  కానీ ఈ దేశంలో ఇంకా మౌళిక వసతులే సమకూరకపోవడం దారుణం. ఇది ప్రజలు ఆలోచించుకోవలసిన సమయం. సమస్య కూడా.  ఇప్పటికీ ఏటా దేశంలో ఆకలికి, చలికి, ఎండలలో వడగాల్పులకు,  వర్షాకాలం వరదలకు ఎన్ని వందల మంది చనిపోతున్నారో తెలుసా… మరి పాలకులు ఏం చేస్తున్నారు, మనం కడుతున్న పన్నులు ఏమౌతున్నాయి. ఎవరూ ప్రశ్నించరా… ?

Life Homepathy
treefurn AD

ఈ వర్షరుతువులో ఇప్పటికే దాదాపు 500 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది ఇల్లూ, పంటలూ, పశువులూ, వ్యాపారాలు కోల్పోయి వీధిన పడ్డారు. అసోంలో దాదాపు లక్షమంది వరదల్లో చిక్కుకున్నారు. చాలామంది గ్రామాల్లో ఇల్లు సైతం నీటిలో   సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. ఇటు కేరళలో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడిన కారణంగా 24 మంది మరణించారు. అధికారులు వెల్లడించిన సమాచారం మేరకు.. కొండచరియలు విరిగిపడడంతో ఇడుక్కిలో 10 మంది, మలప్పురంలో ఐదుగురు, కన్నూరులో ఇద్దరు, వేనాడు జిల్లాలో ఒకరు మరణించారు. ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు.

ప్రతి వర్షాకాలంలో తమది ఇదే పరిస్థితి అని, తమనెవరూ పట్టించుకోరని అసోంలోని కొన్ని గ్రామాల ప్రజలు అంటున్నారు. బిహార్‌లో అయితే ఆస్పత్రులు కూడా వరదల్లో చిక్కుకుపోయాయి. ఆ నీటిలోనే వైద్యులు రోగులకు చికిత్స అందిస్తున్నారు. కొన్ని మహానగరాలలో మెట్రో స్టేషన్లోకే వాన నీరు వచ్చేసింది. నదులు, వాగులు పొంగు తున్నాయి, విషజ్వారలు ప్రభలుతున్నాయి, బడులు, గుడులు, ఆసుపత్రులు నీరు కారుతు న్నాయి. ఏమిటీ దారుణ పరిస్థితి… ఎప్పటికి మారుతుంది. ఇంకా తూర్పు తీరంలో తుపానుల హడావిడి మొదలు కాలేదు. ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమవుతున్నాయి. మనుషులు పిట్టల్లా రాలుతున్నారు. ఇంకా వర్షాకాలం అయిపోలేదు.. ఉంది… చివరికి ఏమౌతుందో.

 

మామాట :  ప్రజలు ఓటర్లుగా ఉన్నంత కాలం ఇలాగే ఉంటుంది కామ్రేడ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: