ఉభయ తెలుగు రాష్ట్రాలలో దంచి కొడుతున్న వర్షాలు…

Share Icons:
 • అనేక ప్రాంతాలు నీట మునక
 • ప్రాజక్టులకు భారీగా వరద నీరు
 • భద్రాద్రి వద్ద గోదావరి ఉగ్రరూపం
 • పర్ణశాలలో నీట మునిగిన సీతమ్మ విగ్రహం
 • ఎస్సారెస్సీ ఎగువన భారీ వర్షాలు
 • పొంగిపొర్లుతున్న గోదావరి
 • హైద‌రాబాద్- విజ‌య‌వాడ హైవేపై  ట్రాఫిక్ జామ్
 • వరదల పరిస్థితులపై తెలుగు రాష్ట్రాల సీఎం లు కేసీఆర్ ,జగన్  అధికారులతో సమీక్షలు
 • అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశం 

ఉభయ తెలుగు రాష్ట్రాలలో గత రెండు రోజులుగా వానలు దంచి కొడుతున్నాయి.ఫలితంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.,అనేక జిల్లాలలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. సహాయక చర్యలకు అధికారాలను రంగంలోకి దించారు. గోడవరి పరివాహక ప్రాంతాలకు వెళ్లవద్దని ,ఎవరు ఇళ్లనుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీచేశారు. ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్  భారీ వర్షాలు, వరదలపై అధికారులతో సమీక్షలు జరిపారు.

తెలంగాణ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు…

 • పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటన
 • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా – పొంగిపొర్లుతున్న కిన్నెరసాని
 • బొగ్గు గనుల్లో చేరిన నీరు
 • నిలిచిన ఉత్పత్తి
 • రాకపోకలకు అంతరాయం

తెలంగాణ వ్యాపితంగా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జన జీవనం అస్తవ్యస్తం అయింది. ప్రధానంగా ,ఖమ్మం , వరంగల్ , కరీంనగర్ , ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలకు ప్రజలాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నారు. దీంతో ఈ జిల్లాలలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. గోదావరి కి భారీ వరద చేరడంతో పరివాహక ప్రాంతాల ప్రజలు ఎవరు బయటకు రావద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్నప్తి చేశారు.

రాగల 48 గంటల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.దే సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, సిద్ధిపేట, కామారెడ్డి, వరంగల్, హన్మకొండ, అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతోపాటు పలుచోట్ల ఉరుములు, మెరుపుల అలజడి ఉంటుందని, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.  హైదరాబాద్ లో ఇప్పటికే భారీ వర్షం కురుస్తోంది. ఇలానే కొనసాగితే చెరువులకు గండ్లు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply