అక్కడ ఎవరు గెలిచిన స్వల్ప మెజారిటీనే వస్తుందంటా….

Share Icons:

అనంతపురం, 13 మే:

ఎన్నికల ఫలితాలు మరో 10 రోజుల్లో వెలువడనున్నాయి. అయితే గెలుపుపై టీడీపీ-వైసీపీలు ధీమాగా ఉన్నాయి. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గాన్ని మరోసారి కైవసం చేసుకుంటామని టీడీపీ చెబుతుంటే…టీడీపీకి చెక్ పెట్టి తమ సొంతం చేసుకుంటామని వైసీపీ ధీమాగా ఉంది.

అయితే ధర్మవరం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఆ పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి ఇక్కడ జరిగిన 8 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏకంగా ఆరుసార్లు గెలుపొందింది. కాంగ్రెస్ రెండు సార్లు గెలిచింది. ఇక  గత ఎన్నికల్లో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గునుగుంట్ల సూర్యనారాయణ(వరదాపురం సూరి) చేతిలో సుమారు 15 వేల తేడాతో ఓడిపోయారు.

ఈ ఎన్నికల్లో కూడా ఈ ఇద్దరే మళ్ళీ బరిలో ఉన్నారు. సూర్యనారాయణకు నియోజకవర్గంలో గట్టి పట్టుంది. అలాగే నియోజకవర్గాన్ని ఈ ఐదేళ్లు అభివృద్ధి చేశారనే క్రెడిట్ సూరికి ఉంది. నియోజకవర్గానికి సాగునీరు అందించామని చెప్పుకున్నారు. సహజంగానే తెలుగుదేశం పార్టీకి ఇక్కడ గట్టి పట్టుంది. దీంతో ఈసారి కూడా తాను గెలుస్తానని ఆయన ధీమాగా ఉన్నారు.

ఇదే సమయంలో వెంకట్రామరెడ్డి కూడా ఈసారి గట్టి పోటీ ఇచ్చారనే అంచనాలు ఉన్నాయి. ఆయన ఓడిపోయినా ప్రజల్లోనే ఉంటూ ఈ ఐదేళ్లుగా తన వర్గాన్ని కాపాడుకోవడంతో పాటు బలం పెంచుకున్నారు. గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి కూడా ఉంది. మొత్తంగా వైసీపీ గత ఎన్నికల కంటే కూడా ఇక్కడ గట్టి పోటీ ఇచ్చింది. అయితే ఇక్కడ ఇద్దరికీ గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇక ఎవరు గెలిచినా అతి స్వల్ప మెజారిటీ మాత్రమే దక్కవచ్చు.

మామాట: ఏదైనా 23 నే తెలుస్తోంది

Leave a Reply