రేవంత్, విశ్వేశ్వర్‌లపై బడా వ్యాపారులు…చెక్ పెట్టడానికేనా?

Share Icons:

హైదరాబాద్, 22 మార్చి:

మరి కొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికల జరగనున్న తరుణంలో అన్నీ పార్టీలు అభ్యర్ధులని ప్రకటించి దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మిగతా పార్లమెంట్ స్థానాలకి భిన్నంగా మల్కాజిగిరి, చేవెళ్ళలో రాజకీయం రసవత్తరంగా ఉన్నాయి. ఈ స్థానాల నుండి కాంగ్రెస్ తరుపున స్ట్రాంగ్ నేతలు రేవంత్ రెడ్డి, కొండ విశ్వేశ్వర్‌రెడ్డిలో బరిలో ఉన్నారు.

స్వంత ఇమేజ్‌తో పాటు ఆర్ధికంగా బలంగా ఉన్న వీరిపై ఇద్దరు బడా వ్యాపారులని రంగంలోకి దింపింది. మల్కాజిగిరి నుండి టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి అల్లుడైన రాజశేఖర్‌రెడ్డిని బరిలో దింపింది. రాజశేఖర్‌రెడ్డి పలు విద్యాసంస్థల అధిపతిగా ఉన్నారు. ఎలాగో ఈయన వెనుక మామ మల్లారెడ్డి ఉన్నారు. ఇక్కడ రేవంత్‌ను ఓడించి మల్కాజిగిరి స్థానం కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. అటు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ కేడర్‌తో పాటు టీడీపీ సానుభూతి పరుల ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరోవైపు చేవెళ్ళ నుండి విశ్వశ్వర్‌పై టీఆర్‌ఎస్‌ బిగ్‌ షాట్‌ను బరిలో నిలిపింది. రాష్ట్ర ఫౌలీ్ట్ర బ్రీడర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు రంజిత్‌రెడ్డిని పోటి పెట్టింది. ఎస్‌ఆర్‌ హెచరీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్న రంజిత్‌రెడ్డి కూడా వందల రూ. కోట్లకు పడగలెత్తారు. పైగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సబితారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఇక్కడ టీఆర్‌ఎస్‌ మరింత బలపడింది. ఇక్కడ గెలుపుపై టీఆర్‌ఎస్‌ ధీమాగా ఉన్నప్పటికీ పోటీ ఉత్కంఠగానే ఉంది. అటు పోలో సంస్థల అధినేత ప్రతాప్‌రెడ్డి అల్లుడైన విశేశ్వరెడ్డి కూడా పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. విశ్వేశ్వరెడ్డి చాపకింద నీరులా ప్రచారం మొదలు పెట్టారు. ఆయనకు పెద్ద సంఖ్యలో ఉన్న బంధువులంతా ప్రచారంలో దిగారు. ఇక్కడ ఆయన చేసిన స్వచ్ఛంద సేవలు కూడా కలిసిరానున్నాయి. మొత్తానికి రేవంత్‌, విశ్వేశ్వర్‌లకి చెక్ పెట్టడానికి గట్టి వాళ్ళనే పెట్టారు గాని…ప్రజామద్ధతు ఉన్న వారిద్దరిని ఓడించడం అంత సులువు కాదేమో..

మామాట: రాజకీయంలో వ్యాపారం అంటే ఇదేనేమో

Leave a Reply