ఖమ్మం కోసం కాంగ్రెస్‌లో కుస్తీలు…

Share Icons:

ఖమ్మం, 22 మార్చి:

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌కి ఏదైనా పట్టు ఉన్న జిల్లా ఏదన్నా ఉందంటే అది ఖమ్మం జిల్లా. దీంతో ఇక్కడ లోక్‌సభ సీటు కోసం నేతలు కుస్తీలు పడుతున్నారు. అందుకే దాదాపు అన్ని సీట్లకు అభ్యర్థులను కాంగ్రెస్ ఫైనల్ చేసింది. కానీ ఒక్క ఖమ్మం సీటు విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతోంది.

ఖమ్మం మాజీ ఎంపీ రేణుకా చౌదరి, పోట్ల నాగేశ్వరరావు, గాయత్రి రవి మధ్య సీటు కోసం పోటీపడుతున్నట్టు సమాచారం. ఈ కారణంగానే ఇక్కడ అభ్యర్థిని ఎంపిక చేయడం కాంగ్రెస్‌కు కత్తిమీద సాములా మారిందనే ప్రచారం సాగుతోంది. మరోవైపు టీఆర్ఎస్ తరపున ఖమ్మం సీటు ఆశించి భంగపడ్డ సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీలోకి వస్తే… ఆయనకు ఖమ్మం కాంగ్రెస్ టికెట్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తనకు ఖమ్మం ఎంపీ సీటు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీని వీడతానని రేణుకా చౌదరి పార్టీకి సంకేతాలు ఇవ్వడం వల్లే… ఖమ్మం సీటుకు అభ్యర్థిని కేటాయించే అంశంపై కాంగ్రెస్ ఆలస్యం చేస్తోందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. అటు కాంగ్రెస్ టీడీపీతో మళ్ళీ పొత్తు కోసం ప్రయత్నిస్తుంది. టీడీపీతో పొత్తు ఉంటే ఖమ్మం, మల్కాజిగిరిల్లో పట్టు సాధించవచ్చు అనుకుంటున్నారు.

మామాట: బలం ఉన్నది అక్కడేగా

Leave a Reply