తిరుపతి, జూలై20 , హిమాలయాల్లో చల్లని మంచు, స్వచ్ఛమైన నీరు , ఆహ్లాదకరమైన వాతావరణమే కాదు ఓ అరుదైన ఔషధం కూడా దొరుకుతుంది. అదే ‘హిమాలయన్ వయాగ్ర’. ఇది కేవలం నపుంసకత్వానికి మాత్రమే మందు కాదు.. కేన్సర్, ఆస్తమా చికిత్సకు కూడా ఉపయోగపడుతుందని నాటు వైద్యులు చెబుతున్నారు.
ఈ హిమాలయ న్ వయాగ్రను ‘యర్సగుంబా’ అంటారు. భారత్, నేపాల్, భూటాన్, టిబెట్‌లోని హిమాలయ ప్రాంతాల్లో ఇది దొరుకుతుంది. నేలలో ఉండే ఒక విధమైన ఫంగస్ సోకి చనిపోయిన గొంగళిపురుగు యర్సగుంబా గా మారుతుంది. దీనిని సేకరించేవారు ఒక్కో యర్సగుంబా రూ. 300 వరకూ విక్రయిస్తారు. కానీ అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ కిలో రూ.70 లక్షలు. యర్సగుంబాను అమెరికా, ఇంగ్లండ్, చైనా, సింగపూర్, జపాన్, కొరియా, మయన్మార్, థాయ్‌లాండ్ లాంటి దేశాలకు ఎగుమతి చేస్తారు. ఒక గ్రాము రూ. 7 వేలు వరకు ఉంటుంది. గొంగళి పురుగుకు నేలలో ఉండే ఒకరకమైన ఫంగస్ సోకి, అది మరణించాక యర్సగుంబాగా మారుతుంది. ఇది 3 వేల నుంచి 5 వేల మీటర్ల ఎత్తులో పెరుగుతుంది. కానీ అంత ఎత్తులో వీటిని సేకరించడం ప్రాణాలతే చెలగాటమాడడమే, విపరీతమైన చలి కారణంగా కొన్ని సార్లు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. మంచు తుఫానులు ప్రమాదకరమైనవి.
మే,జూన్ మాసాల్లో వేలాది మంది యర్సగుంబా వేటమొదలుపెడతారు. గతంలో రొజుకు ఒక్కో వ్యక్తీ వంద వరకూ సేకరించే వారు కానీ ఇటీవల మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా 20 కంటే ఎక్కువ లభించడం లేదని చెబుతున్నారు.
ఇది సాధారణంగా విపరీతమైన నిస్సత్తువను తగ్గించడానికి, వత్తిడిని ఎదుర్కోవడానికి, శక్తనివ్వడానికి, కిడ్నీలకు బలంచేకూర్చడానికి, ఊపిరి తిత్తులకు శక్తినివ్వడానికి, స్త్రీ పురుషులలో శృంగార శక్తి పెరగడానికి, వీర్యవృద్ధికి, రోగనిరోధక శక్తి పెరగడానికి, శరీర శక్తి, కండరాలకు బలం చేకూరడానికి, గొంతులో శ్ల్మేషం తొలగడానికి, మానసికంగా బలంగా ఉండడానికి మందుగా వినియోగిస్తారు.
మామాట: గొంగళి పురుగు సీతాకోక చిలుకగానే కాదు ఇలా కూడా ఉపయోగపడుతోందా….