తెలంగాణలో విజృంభిస్తోన్న స్వైన్ ఫ్లూ…

Share Icons:

హైదరాబాద్, 20 అక్టోబర్:

తెలంగాణలో స్వైన్ ఫ్లూ మహమ్మారి విజృంభిస్తోంది. అందులోనూ ఈ వ్యాధి రాజధాని నగరం హైదరాబాద్ ప్రాంతంలో మరింత ఎక్కువగా ఉంది. ఈ నెలలో ఇప్పటివరకూ ఒక్క తెలంగాణలోనే 125 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటివరకు ఈ మహమ్మారి కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఇక వ్యాధి కేవలం సామాన్యులే కాదు.. సాక్షాత్తూ ఐఏఎస్, ఆర్డీవో స్థాయి అధికారులు ఉండటం గమనార్హం. ముగ్గురు ఐఏఎస్ అధికారులు, నలుగురు డీఆర్వో, ఆర్డీవో స్థాయి అధికారులు ఈ వ్యాధి భారీన పడినట్లు సమాచారం. దీంతో అధికారుల పేర్లను బయటపెడితే మళ్లీ విధి నిర్వహణలో ఇబ్బందులు వచ్చే అవకాశమున్నందున గోప్యత పాటిస్తున్నారు.

స్వైన్ ఫ్లూ అనేది హెచ్1 ఎన్ 1 వైరస్. ఇది భారత్‌లో చాలా చోట్ల ఉంది. ఒక వ్యక్తికి హెచ్1 ఎన్ 1 వైరస్ సోకితే.. ఆ వ్యక్తి తుమ్మినా, ఆ వ్యక్తి పీలుస్తున్న గాలిని పీల్చనా పక్కనే ఉన్న వ్యక్తికి వ్యాపిస్తుంది. వైరల్ ఫీవర్, దగ్గు ,జలుబు, ఒళ్లు నొప్పులు వీటి లక్షణాలు. ఇది ఎక్కువగా చిన్నపిల్లలు, గర్భవతులు, వయస్సు మీద పడిన వారికి త్వరగా సోకే అవకాశాలున్నాయి.

కాగా, నగరంలో స్వైన్ ఫ్లూ కేసులు పెరిగిపోతున్నాయని తెలంగాణ వైద్యవృత్తి డైరెక్టర్ రమేష్ రెడ్డి పేర్కొన్నారు. కాబట్టి నగరవాసులు జాగ్రత్తలు తీసుకోవాలని, బయటకి వెళ్ళేప్పుడు నోటికి మాస్కులు ధరించి వెళ్లాలని సూచించారు.

మామాట: స్వైన్ ఫ్లూ భారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి……

Leave a Reply