భారత్ అమ్మాయిని వివాహం చేసుకోబోతున్న మరో పాక్ క్రికెటర్….

Hasan Ali set to marry Indian girl in Dubai
Share Icons:

ఢిల్లీ:

 

కొందరు పాకిస్థాన్ క్రికెటర్లు భారత అమ్మాయిలను పెళ్లాడిన విషయం అందరికీ తెలుసు… అందులో పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం జహీర్ అబ్బాస్, మోహిన్ ఖాన్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ కూడా భారతీయ యువతులనే పెళ్లాడారు. అయితే షోయబ్ మాలిక్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

 

ఈ నేపథ్యంలోనే తాజాగా పాకిస్థాన్ పేస్ బౌలర్ హసన్ అలీ కూడా భారత్ అమ్మాయిని వివాహం చేసుకొనున్నాడు. హసన్ అలీ వివాహం హర్యానాకు చెందిన షమియా అర్జూతో ఆగస్టు 20న జరగనుంది. హసన్ అలీ వయసు 25 ఏళ్లు. దుబాయ్ లో ఓ సన్నిహితుడి ద్వారా షమియాతో హసన్ అలీకి పరిచయం ఏర్పడింది. ఇంగ్లాండ్ లో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివిన షమియా గతంలో దుబాయ్ కేంద్రంగా జెట్ ఎయిర్ వేస్ లో పనిచేసింది. వీరి పెళ్లి కూడా దుబాయ్ లోనే జరగనుందని తెలుస్తోందో.

 

ఇక, హసన్ అలీ విషయానికొస్తే 2017 చాంపియన్స్ ట్రోఫీలో పాక్ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. అలాగే హాసన్ పాక్ జట్టు తరుపున ఇప్పటివరకు 9 టెస్టులు, 53వన్డేలు, 30 టీ-20లు ఆడాడు.

 

Leave a Reply