ముద్దులొలుకుతున్న ‘లిల్లీ డయాన’

Share Icons:

రాచరికాన్ని తృణప్రాయంగా వదులుకుని సామాన్య జీవితం గడుపుతున్న ప్రిన్స్‌ హ్యారీస్‌, మేఘన్‌ మార్కెల్‌ దంపతులు ఆనందడోలికల్లో తేలిపోతున్నారు. చుట్టుముట్టిన కష్టాల నడుమ వారింట్లో బోసి నవ్వులు విరబూశాయి. మేఘన్‌-హ్యారీ దంపతులు ముద్దులొలికే పసిపాపకి తల్లిదండ్రులయ్యారు . జూన్‌ 4న కాలిఫోర్నియాలోని శాంట బార్బరా కాటేజ్‌ హాస్పటిల్‌లో మేఘన్‌ మార్కెట్‌ ప్రసవించింది. అప్పుడు హ్యరీ కూడా అక్కడే ఉన్నారు.

హ్యారీ, మేఘన్‌ జీవితాల్లోకి వచ్చిన చిన్నారి పాపకు ‘లిల్లీ డయానా’ అని పేరు పెట్టుకున్నారు. ఈ పేరు వెనక పెద్ద కథే ఉంది. ప్రస్తుతం బ్రిటిష్‌ రాజకుటుంబ మహారాణి ఎలిజబెత్‌ చిన్నప్పటి ముద్దుపేరు లిల్లీబెట్‌. అలాగా రాచరికపు ఆంక్షలను ఎదిరించి చనిపోయిన తన హ్యారీ తల్లి పేరు డయానా. వీరిద్దరి గౌరవార్థం తన కూతురికి లిల్లీబెట్‌ డయాన మౌంట్‌బాటెన్‌ విండ్సర్‌ గా పేరు పెట్టారు. హ్యారీ మేఘన్‌లకు 2019 కొడుకు లో జన్మించాడు. ఆ బాలుడి పేరు ఆర్చీ.

సేకరణ :- మామాట డస్క్ (అంతర్జాల సంచికల నుండి)

Leave a Reply