ఆకట్టుకునే బ్లూటూత్ ఇయర్ ఫోన్స్…ధర ఎంతటే?

harmano-sporto-wireless-earphones-launched-in-india
Share Icons:

ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ తయారీదారు అమానీ భారత్‌లో నూతనంగా ఏఎస్‌పీ-బీటీ-6310 పేరిట వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్స్‌ను లాంచ్‌ చేసింది. రూ.999 ధరకు ఈ ఇయర్‌ఫోన్స్‌ను వినియోగదారులు అమానీ మార్ట్‌ సైట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇవి 6 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయి. కేవలం 17.64 గ్రాముల బరువును మాత్రమే ఈ ఇయర్‌ఫోన్స్‌ కలిగి ఉన్నాయి. బ్లూటూత్‌ 4.0 ద్వారా ఈ ఇయర్‌ఫోన్స్‌ ఫోన్లకు కనెక్ట్‌ అవుతాయి. 2 గంటల్లో ఈ ఇయర్‌ఫోన్స్‌ను పూర్తిగా చార్జింగ్‌ చేసుకోవచ్చు.

అటు హర్మానా కంపెనీ స్పోర్టో పేరిట నూతన వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్స్‌ను భారత్‌లో విడుదల చేసింది. రూ.1995 ధరకు వీటిని వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. బ్లూటూత్‌ 5.0 ద్వారా ఈ ఇయర్‌ఫోన్స్‌ ఫోన్లకు కనెక్ట్‌ అవుతాయి. ఇవి కేవలం 22 గ్రాముల బరువును మాత్రమే కలిగి ఉన్నాయి. అందువల్ల వీటిని చాలా తేలిగ్గా క్యారీ చేయవచ్చు. ఇక 180 ఎంఏహెచ్‌ బ్యాటరీని వీటిలో ఏర్పాటు చేసినందున ఈ ఇయర్‌ఫోన్స్‌ 16 గంటల వరకు నాన్‌స్టాప్‌గా పనిచేస్తాయి. కేవలం 1.5 గంటల వ్యవధిలోనే ఈ ఇయర్‌ఫోన్స్‌ పూర్తిగా చార్జింగ్‌ అవుతాయి.

ఆపిల్‌ కార్‌ కీ

ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఆపిల్‌ తన ఐఫోన్‌ వినియోగదారులకు త్వరలో ఓ అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. కార్‌ కీ (Car Key) అనే ఫీచర్‌ను త్వరలో నూతన ఐఓఎస్‌ వెర్షన్‌లో ఆపిల్‌ అందివ్వనుంది. ఈ ఫీచర్‌ సహాయంతో ఐఫోన్ల ద్వారా వినియోగదారులు తమ కార్‌ను లాక్‌, అన్‌లాక్‌ చేసుకోవచ్చు. కార్‌ను స్టార్ట్‌ కూడా చేయవచ్చు. అందుకు గాను కార్లలో ఎన్‌ఎఫ్‌సీ సదుపాయం ఉండాలి. ఈ క్రమంలో ముందుగా ఫోన్‌లోని కార్‌ కీ యాప్‌తో ఐఫోన్‌, కార్‌లు పెయిర్‌ అవుతాయి. ఆ తరువాత కార్‌ తాళాలు లేకుండానే కార్‌ను ఐఫోన్‌ సహాయంతో లాక్‌, అన్‌లాక్‌ చేయవచ్చు. కార్‌ను స్టార్ట్‌ కూడా చేయవచ్చు. ఐఓఎస్‌ 13.4 వెర్షన్‌లో ఆపిల్‌ ఈ ఫీచర్‌ను యూజర్లకు అందివ్వనుంది.

 

Leave a Reply