TRENDING NOW

చంద్రబాబుకు హరీశ్ రావు బహిరంగ లేఖ

చంద్రబాబుకు హరీశ్ రావు బహిరంగ లేఖ

హైదరాబాద్,నవంబర్ 8:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణను మోసం చేయాలని చూస్తున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు.  18 ప్రశ్నలను సంధిస్తూ ఆయన చంద్రబాబుకి ఒక బహిరంగ లేఖ రాశారు.

తెలంగాణలోని నీటి పారుదల ప్రాజెక్టులను అడ్డుకోవాలని కుట్ర చేయడం లేదా? పాలమూరు ఎత్తిపోతల కడతామని 2014 ఎన్నికల్లో మీరు హామీ ఇవ్వలేదా? ఆ ప్రాజెక్టును నిర్మించారా? అని హరీశ్ రావు ప్రశ్నించారు.

Life Homepathy
treefurn AD
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,

కొన్ని సీట్లు గెలవడం ద్వారా తెలంగాణను మోసం చేయాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణను విఫల రాష్ట్రంగా చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.  తెలంగాణలో ప్రాజెక్టులు ఆపాలంటే కేంద్రానికి చంద్రబాబు లేఖలు రాస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం అంటే చంద్రబాబు అసలు గిట్టదని, తెలంగాణ ఏర్పాటును చివరి వరకు చంద్రబాబు అడ్డుకున్నారని విమర్శించారు.

తెలంగాణను విఫల రాష్ట్రంగా చేయాలని బాబు ప్రయత్నించారని ఆరోపించారు. తెలంగాణలో రాజకీయ అస్థిరతకు ప్రయత్నించారన్నారు. తెలంగాణ పట్ల చంద్రబాబుకు నరనరాన వ్యతిరేకత ఉందని హరీశ్ విమర్శించారు. తెలంగాణ ఏర్పడినప్పుడు విద్యుత్ ఇవ్వకుండా బాబు ఇబ్బందిపెట్టారన్నారు. కేసీఆర్ నేతృత్వంలో వెలుగుల తెలంగాణను రూపొందించామని హరీశ్‌రావు పేర్కొన్నారు.

హరీశ్ బహిరంగ లేఖలో ఉన్న విషయాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

– పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు కడతామని 2014 ఎన్నికల్లో హామీ ఇవ్వలేదా?

– కాలేశ్వరం ప్రాజెక్టుపై విషం చిమ్మడం మీ దుష్ట ఆలోచన కాదా?

– పాలేరుకు నీళ్లివ్వడం కూడా పాపమేనా?

– కెసి కెనాల్ కోసం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని వద్దంటారా?

– కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై కుట్రలు చేస్తున్నది నిజం కాదా?

– పోలవరానికి బదులుగా కృష్ణా నీళ్లు ఇవ్వకుండా నాటకాలు ఆడటం లేదా?

– శ్రీశైలంనుంచి తెలంగాణకు నీరివ్వవద్దని అనడం మీ కుతంత్రం కాదా?

– ఎవరి అనుమతులతో కొత్త ప్రాజెక్టులు కడుతున్నారు?

– పోలవరం మండలాలు గుంజుకోవడం మొదటి అన్యాయం కాదా?

– సీలేరు ప్లాంటు పోవడం వల్ల ఏడాదికి 500 కోట్ల రూపాయిలు నష్టం రావడం లేదా?

– విద్యుత్ పంపిణీ విషయంలో దుర్మార్గమైన వైఖరి అవలంబించలేదా?

– పిపిఎలను ఏకపక్షంగా రద్దు చేసి 2465 మెగావాట్లు ఎగ్గొట్టలేదా?

– 4557 కోట్ల నష్టం చేసిన కుటిలత్వం మీది కాదా?

– ఇవ్వాల్సిన కరెంటు ఇవ్వకుండా టెండర్లలో పాల్గొన్న కుంచితత్వం మీది కాదా?

– ఆంధ్ర ఉద్యోగులను తెలంగాణపై రుద్ది 1000 కోట్ల భారం మోపలేదా?

– ఖాళీ భవనాలు ఇవ్వకపోవడం మీ సంకుచితతత్వం కాదా?

– హైదరాబాద్ ఆస్తుల్లో వాటా అడగటం మీ దురాశ కాదా?

– విభజన మాయని గాయం అని బాధపడలేదా?

మామాట: మీకు ప్రత్యర్ధి చంద్రబాబేనా….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: