రెండురోజులు సంతాప దినాలు

Share Icons:

విజయవాడ, ఆగస్టు 29,

మాజీ మంత్రి, రాజ్యసభ మాజీ సభ్యుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ మృతికి సంతాపంగా ఏపీ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. రాష్ట్రంలో ఈరోజు, రేపు అధికారిక కార్యక్రమాలన్నింటినీ ప్రభుత్వం రద్దు చేసింది. జాతీయ జెండాను అవనతం చేయాలని ఏపీ సర్కారు సర్క్యులర్ జారీ చేసింది.  కాగా, మెహిదీపట్నం నుంచి రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు హరికృష్ణ అంతిమ యాత్ర ప్రారంభమవుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో రేపు సాయంత్రం హరికృష్ణ అంత్యక్రియలు నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు, హరికృష్ణ కుటుంబ సభ్యులు నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశిం చిన విషయం తెలిసిందే, తొలుత ఫాం హౌస్ లో అంతమసంస్కారం నిర్వహించాలనుకున్నా, చివరికి మహాప్రస్థానలో నిర్వహించాలనుకున్నారు. దీనిపై స్పంధిస్తూ..  రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారని  తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వివరించారు.

మాామాట:  మరో రోడ్డుప్రమాదంలో మరో వ్యక్తిని కోల్పోకపోవడమే నివాళి

Leave a Reply