భజ్జీ ఏమన్నా సెటైర్ వేశాడు: పాక్ నటికి దిమ్మతిరిగే రిప్లై

Harbhajan Mocks Veena Malik's English in Twitter War Over Imran Khan's Speech
Share Icons:

ఢిల్లీ: గత కొన్ని రోజులుగా కశ్మీర్ విషయంలో ఇండియా-పాకిస్థాన్ దేశాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. కశ్మీర్ లో ఆర్టికల్ 270 రద్దు చేయడంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, మరికొందరు పాక్ నేతలు, క్రికెటర్లు,సినీ నటులు భారత్ పై విషం కక్కుతున్నారు. ట్విట్టర్ వేదికగా ఇండియాపై విమర్శలు చేస్తున్నారు. ఇక వారి విమర్శలని భారత్ నుంచి కూడా గట్టి కౌంటర్లు వస్తున్నాయి. ఇక ఇటీవల భారత్ కు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై… పాక్ నటి వీణామాలిక్, టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ ల మధ్య ట్వీట్ల యుద్ధం జరుగుతోంది.

మొదట ఇమ్రాన్ వ్యాఖ్యలపై హర్భజన్ ట్వీట్ చేశాడు. ఇమ్రాన్ ప్రసంగం ద్వారా భారత్ కు అణుయుద్ధ సంకేతాలు అందుతున్నాయని… ఒక గొప్ప క్రికెటర్ అయిన ఆయన మాటలు రెండు దేశాల మధ్య విద్వేషాలను మరింత పెంచేలా ఉన్నాయని అన్నాడు. ఒక మేటి ఆటగాడైన పాక్ ప్రధాని తన ప్రసంగాలతో శాంతిని నెలకొల్పే విధంగా వ్యవహరించాలని తాను కోరుకుంటున్నానని చెప్పాడు.

ఇక హర్భజన్ ట్వీట్ పై వీణామాలిక్ స్పందిస్తూ… తమ ప్రధాని శాంతి గురించే మాట్లాడారని… కశ్మీర్ లో కర్ఫ్యూ ఎత్తేస్తే జరగబోయే హింసాత్మక ఘటనల గురించి వివరించారని ట్వీట్ చేసింది. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను మాత్రమే స్పష్టంగా  చెప్పారని పేర్కొంది. అంతేకాదు నీకు ఇంగ్లీష్ అర్థం కాదా? అని హర్భజన్ ను ప్రశ్నించింది. అయితే, ఈ ట్వీట్ లో ఇంగ్లీష్ పదం surelyకి బదులుగా surly అని రాసింది.

ఆ వెంటనే వీణామాలిక్ ట్వీట్ పై భజ్జీ సెటైర్ వేశారు. surly అంటే ఏమిటి? అది surelyయేనా? అంటూ ఎద్దేవా చేశారు. ఇకనైనా ఇంగ్లీష్ లో రాసేటప్పుడు మరోసారి చదువుకో అంటూ సమాధానమిచ్చాడు. మొత్తానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి వీణామాలిక్ నోరు మూయించాడు. మరి దీనిపై వీణా ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

Leave a Reply