మొదలైన ఐదో టెస్ట్…జట్టులో తెలుగు ఆటగాడు….

Hanuma Vihari receives Test cap from Virat Kohli
Share Icons:

లండన్, 7 సెప్టెంబర్:

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య చివరిదైనా ఐదో టెస్ట్ భారత్ కాలమానం ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 13 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది.

ఇక ఇప్పటికే టెస్ట్ సిరీస్‌ని 3-1 తేడాతో కోల్పోయిన భారత్ చివరి టెస్ట్ అయిన గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే కోహ్లీ సేన చివరి టెస్ట్‌కు రెండు మార్పులతో బరిలోకి దిగింది. హార్దిక్‌ పాండ్యా స్థానంలో తెలుగు ఆటగాడు హనుమ విహారి, రవిచంద్రన్‌ అశ్విన్‌ స్థానంలో రవీంద్ర జడేజాలను తీసుకుంది.

ప్రస్తుతం ఆంధ్రా క్రికెట్ సంఘం తరపున ఆడుతున్న విహారి హైదరాబాద్ నుంచే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. గత రెండేళ్లుగా భారత్-ఎ, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో విహారి నిలకడగా రాణిస్తున్నాడు. దీంతో జట్టులోకి అతడిని ఎంపిక చేశారు.

మామాట: మరి విహారి వీర విహారం చేస్తాడా?

Leave a Reply