ఉరి..అనుకున్నంత సులువు కాదు

Share Icons:

హైదరాబాద్, సెప్టెంబర్ 11,

 

ఇది ఇండియా, ఇక్కడ ఏమైనా జరుగుతుంది. ఏమో గుర్రం ఎగరావచ్చు.. అనేది ఇక్కడ అందరూ నమ్మే థియరీ. స్వేచ్ఛ విపరీతంగా వీస్తున్న దేశంలో అధికారమే పరమావధిగా రాజకీయాలు నడుస్తున్న సమయంలో ఈ దేశంలో శిక్షలు విధించడం, వాటిని అమలు చేయడం కూడా ఓట్ల మాయాజాలంలో ఓ భాగం మాత్రమే. గోకుల్ చాట్, లుంబినీ పార్కులో జరిగిన జంట బాంబు పేలుళ్ల దోషులకు ఎట్టకేలకూ శిక్ష ఖరారు అయ్యింది. మొత్తం నిందితుల్లో ముగ్గురిని దోషులుగా తేల్చిన నాంపల్లి కోర్టు ఇద్దరికి ఉరిశిక్షను, మరొకరికి జీవిత ఖైదును విధించింది. 11 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ దోషులకు ఉరిశిక్ష పడింది. ఈ కేసుల్లో వీరి దోషిత్వం గత వారంలోనే రుజువు కాగా, తాజాగా న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది. ఉగ్రవాద నిరోధక చట్టాల ప్రకారం వీరికి ఉరిశిక్ష పడింది.వీరు పొట్టన పెట్టుకుంది 44 మంది అమాయకులను. మరో 77 మంది గాయపడ్డారు. వీరిలో వికలాంగులుగా మారి జీవితం దుర్భరం అయినవారు ఉన్నారు. ఇంతటి పాపానికి ఒడిగడ్డిన వారికి ఒక ఉరిశిక్ష కాదు.. వంద ఉరిశిక్షలు విధించినా తప్పులేదు.అయితే వీరికి ఉరైతే పడింది కానీ.. అమలు ఎప్పుడు? అనేది ప్రశ్నార్థకమే.

ఈ ఉరి పడటానికి కూడా 11 సంవత్సరాలు పట్టాయి. ఇక ఈ ద్రోహులు పైకోర్టు మెట్లు ఎక్కుతారు. అంతిమంగా రాష్ట్రపతి వరకూ వెళ్లి వీళ్లకు ఉరి ఖరారు అయ్యేసరికి ఇంకో 11యేళ్లు పట్టొచ్చు. ఆ తర్వాత కూడా అమలుకు మరింత సమయం పట్టొచ్చు. కాబట్టి వీళ్ల ఉరి జీవితకాలం లేటు కావొచ్చు. ఇదివరకూ కూడా పలువురు ఉగ్రవాదులకు క్యాపిటల్ పనిష్మెంట్‌ను అమలు చేయడానికి భారత ప్రభుత్వానికి సంవత్సరాలకు సంవత్సరాలు పట్టింది. ఇక ఈ జంటబాంబు పేలుళ్ల కేసులో అసలు దోషులు పక్క దేశం పాక్‌లో ఉన్నారని కూడా కోర్టు, ధర్యాప్తు సంస్థ స్పష్టంచేశాయి. ఈ పేలుళ్ల సూత్రధారులు అక్కడకు వెళ్లి దాక్కున్నారు. వారికి ఆ దేశం ఆశ్రయం ఇచ్చిందనేది బహిరంగ రహస్యం. వాళ్లను పట్టి తెచ్చేంత శక్తి కానీ, వాళ్లను అక్కడే అంతం చేసే చాతుర్యం కానీ ఇండియాకు లేనట్టే!

అంతేనా, విచారణకే 11 యేళ్లు పట్టింది, శిక్ష అమలుచేయడానికి మరో రెండు దశాబ్ధాలు పడుతుంది ఫరవాలేదు అనే జోకులు కూడా ఫేస్ బుక్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ లోగా సదరు వర్గానికో, మతానికో చెందిన వారు లేదా వారి మద్దతు కావాలనుకునే వారు అదికారంలోకి వస్తే వారే స్వయంగా క్షమాభిక్ష కూడా ప్రసాధిస్చారు… రాజీవ్ హంతకులనే వదిలేయ లేదా… ఇదెంత… ఎన్నికలు.. ఓట్లు.. అధికారం కావాలి గానీ సమాజం, విధి విధానాలు ఎవరిక కావాలబ్బాయ్… చెప్పూ….!

 

మామాట:  అన్నీ సెక్యులర్ ప్రభుత్వాలే కదా..

Leave a Reply