అదరగొట్టిన ఆసీస్ బ్యాట్స్‌మెన్…భారత్ టార్గెట్ 289…

Share Icons:

సిడ్నీ, 12 జనవరి:

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌తో సిడ్నీలో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ అద్భుత ప్రదర్శన చేశారు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫించ్‌ని 6 పరుగులకే భువనేశ్వర్ ఔట్ చేశాడు. ఇక ఆ తర్వాత మరో ఓపెనర్ అలెక్స్‌(24)ని కుల్దీప్ ఔట్ చేశాడు. దీంతో 41 పరుగులకి 2 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ని ఖవాజా(59), మార్ష్(54) ఆదుకున్నారు. భారత్ బౌలర్లని సమవర్ధవంతంగా ఎదురుకుని పరుగులు రాబట్టారు.

ఈ క్రమంలోనే ఖవాజాని జడేజా దెబ్బకొట్టాడు. 133 పరుగుల వద్ద జడేజా బౌలింగ్‌లో ఎల్బీగా ఔట్ అయ్యాడు. ఆ తర్వాత నిలకడగా ఆడుతున్న మార్ష్‌ని కుల్దీప్ ఔట్ చేశాడు. అయితే హండ్స్‌కంబ్(73), స్టయినస్(47 నాటౌట్), మ్యాక్స్‌వెల్(11 నాటౌట్) దూకుడుగా ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 288/5 పరుగులు చేసి..భారత్ ముందు 289 పరుగుల లక్ష్యాన్ని ముందు ఉంచింది. భారత్ బౌలర్లలో భువనేశ్వర్ 2, కుల్దీప్2, జడేజా 1 తీసుకున్నారు.

మామాట: ఇక బ్యాట్స్‌మెన్‌దే భారం…

Leave a Reply