విషం తాగుతున్న భారత్….

Half of the indian people drunk a polluted water
Share Icons:

ఢిల్లీ, 31 జూలై:

భారత్ విషం తాగుతుంది…అవును…మీరు వింటున్నది నిజమే దేశంలోని సగం పైనే ప్రజలు విషపూరితమైన నీటిని తాగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కి తెలిపింది. రసాయనాలు, పారిశ్రామిక వ్యర్థాలు, పురుగు మందుల కారణంగా దేశంలోని భూగర్భ జలాలు తీవ్రంగా కలుషితం అయ్యాయని, దేశంలోని సగం జిల్లాల్లో నీటిలో నైట్రేట్స్, లెడ్, ఆర్సెనిక్, ఫ్లోరైడ్, కాడ్మియం, ఇతర భార లోహాలు ఉన్నాయని వెల్లడించింది.

కేంద్రం పార్లమెంట్‌కి తెలిపిన వివరాల ప్రకారం… దేశంలో మొత్తం 718 జిల్లాలు ఉండగా, అందులో సగంపైనే అంటే 386 జిల్లాల్లోని భూగర్భ జలాల్లో హానికారక రసాయనాలు సాధారణం కంటే 50 శాతం ఎక్కువగా ఉన్నాయి.

ఇక అందులో ఎక్కువగా ఢిల్లీలోని 11 జిల్లాల్లో ఏడింటిలో ఫ్లోరైడ్ కాలుష్యం తీవ్రంగా ఉంది. అలాగే దేశంలోని 335 జిల్లాల్లో ఫోర్లైడ్, 153 జిల్లాల్లో ఆర్సెనిక్, 24 జిల్లాల్లో కాడ్మియం వంటి రసాయనాలున్న నీటిని తాగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.

అలాగే ఈ నీటిని వాడితే చర్మ, కాలేయ కేన్సర్ తో పాటు కిడ్నీలు ఫెయిల్ కావడం, రక్తంలో ఆక్సీజన్ శాతం తగ్గిపోవడం, బీపీ, నపుంసకత్వం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

కాగా, ఈ విషపూరితమైన నీటిని తాగే రాష్ట్రాల్లో తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణా, పశ్చిమబెంగాల్‌లు ముందు ఉన్నాయి. ఇక్కడి భూగర్భ జలాల్లో అన్నిరకాలైన విషపూరిత రసాయనాలు, భార లోహాలు ఉన్నాయని కేంద్రం తెలిపింది.

మామాట: మరి దీనికి పరిష్కారం ఏమిటో?

Leave a Reply