జామ ఆరోగ్య బీమ

Share Icons:

అందరికీ అందుబాటులో ఉంటూ, సులభంగా లభించే  జామ  ఆరోగ్యప్రదాయని. ఇదో పోషకాల గని. ఒక్క జామపండు తింటే పది యాపిల్స్‌ తిన్నంత మేలు జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో విరివిగా లభించే జామపండ్లను తరుచూ తీసుకుంటే ఆరోగ్యంతో పాటు చర్మసౌందర్యంకూడా మీ సొంతం. విటమిన్‌ సీ పుష్కలంగా లభ్యమయ్యే జామపండ్లను చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ తీసుకోవచ్చు, మధుమోహం, గుండెజబ్బులు ఉన్నవారు సైతం జామపండ్లను ఎంచక్కా తినవచ్చునని నిపుణులు స్పష్టంచేస్తున్నారు.

జామపండు  తరచుగా తీసుకోవడం ద్వారా ఇది కళ్లకు రక్షణ ఇస్తుంది. కళ్ల మంటలు తగ్గుతాయి, కళ్ల కింద చారలు పోతాయి. వివిధ క్యాన్సర్లనూ నివారిస్తుంది. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. దంతాలు, చిగుళ్లవాపు, గొంతు నొప్పిని అరికడుతుంది. అధిక బరువును తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేస్తుంది. వీటి గింజల్లో ఒమోగా-3 ఒమోగా-6 కొవ్వు అమ్లాలు, పీచు పదార్ధలు ఉంటాయి. మెగ్నీషియం, కెరబోనాయిడ్లు ఉండడంవల్ల దంత సమస్యలు దూరమవుతాయి. ఇందులోని పీచు పదార్ధం మల్లబద్దకాన్ని నివారిస్తుంది. మధుమేహ వ్యాధి నివారణకు తోడ్పడుతుంది. జామ ఆకుల్లో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. వాటిని నమిలితే పంటి నొప్పిలు తగ్గుతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. రోజుకో జామ పండు తినడం వల్ల ఎసిడిటీ, కడుపుఉబ్బరం, కడుపులో మంటలు తగ్గుతాయి. మహిళల్లో సంతానోత్పత్తిని పెంచే హార్మోన్లు విడుదలకు  జామ ఉపకరిస్తుంది.

జామ పండులో విటమిన్‌ ఏ, బీ, సీ విటమిన్లు ఉన్నాయి. క్యాల్షియమ్‌, పొస్పరస్‌, పొటాషియం, ఐరన్‌, ఫోలీక్‌యాసిడ్‌ మెండుగా లభిస్తాయి.  100 గ్రాముల జామ పండులో 0.3గ్రాముల కొవ్వు , 0.9గ్రాముల ప్రొటీన్‌, 5.2 గ్రాముల పీచు పదార్ధం, 212 మిల్లీ గ్రాముల సీ విటమిన్‌, 5.5మిల్లీ గ్రాముల సోడియం, 91 మిల్లీ గ్రాముల ఇనుము, 51 కిలో కాల్యలరీల శక్తి లభిస్తాయి.

మామాట : మాపెరటి జాంచెట్టులో ఇన్ని మంచి గుణాలున్నాయా!

Leave a Reply