టీడీపీ వాళ్ళు మోసం చేశారని హైకోర్టును ఆశ్రయించారు

Share Icons:

హైదరాబాద్‌ డిసెంబర్౩౦: అధికార పార్టీ తెలుగుదేశం నాయకుల ఆగడాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నయి, గుంటూరు జిల్లా, మంగళగిరిలో పార్టీకి కార్యాలయ నిర్మాణం నిమిత్తం ఇచ్చిన భూమి తమదని, తమకు ఎటువంటి పరిహారం ఇవ్వకుండానే భూమిని తీసుకున్నారంటూ మంగళగిరి ప్రాంతానికి చెందిన బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించారు. పరిహారం ఇవ్వకుండా భూమి తీసుకోవడంపై విస్మయం వ్యక్తం చేసిన హైకోర్టు, ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ ఘటనపై రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్‌ తహసీల్దార్‌లతో పాటు వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా ఉన్న ఆర్‌డీవో సంగా విజయలక్ష్మికి కోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను జనవరి 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయ మూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌. రామచంద్రరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

మామాట: అన్నదాతలకు అన్యాయం జరిగితే సహించం.

Leave a Reply