భార్యలు పుట్టింటికెళ్లారని ఒకేరోజు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు భర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన బాపట్లలో జరిగింది. పట్టణంలోని కొండలరావు వీధిలో నివాసముంటున్న మున్నా(30) భార్య భర్తతో గొడపడి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే తరహాలో బాపట్లలోనే మరో ఘటన చోటుచేసుకుంది.
Also Read:
పట్టణానికి చెందిన కోకి దుర్గారెడ్డి(37) దంపతులు పట్టణంలోని విజయలక్ష్మీపురంలో నివాసం ఉంటున్నారు. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో దుర్గారెడ్డి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్థాపానికి గురైన భర్త ఇంట్లోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఒకే రోజు రెండు ఆత్మహత్య ఘటనలతో స్థానికుల్లో చర్చనీయాంశమైంది. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: