కారుపై మూత్ర విసర్జన చేశాడంటూ…హీరోయిన్ ఫిర్యాదు..!!

Share Icons:

గుజరాత్, 8 మార్చి:

తన కారు టైరుపై మూత్ర విసర్జన చేశాడని ఆరోపిస్తూ హీరోయిన్ మోనల్ గజ్జర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ షాపింగ్ మాల్ నుంచి తాను బయటకు వస్తున్న సమయంలో… సదరు వ్యక్తి ఈ పాడు పని చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది.

తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, మ‌రాఠి చిత్రాల‌లో న‌టించిన మోనాల్ రీసెంట్‌గా త‌న సోద‌రి పాయ‌ల్ బ్యూటీ పార్ల‌ర్‌కి వెళ్లింది. గుల్బాయ్ టెక్రా కాంప్లెక్స్ ముందు త‌న కారు పార్క్ చేసి లోప‌లికి వెళ్ళింది మోనాల్‌. కొద్ది సేప‌టి త‌ర్వాత తాను తిరిగి ఇంటికి వెళ‌దామ‌నుకున్న స‌మ‌యంలో ఓ వ్య‌క్తి త‌న కారు ముందు బ‌హిరంగ మూత్ర విస‌ర్జన చేస్తూ క‌నిపించాడు. వెంటనే కంగారు పడ్డ ఆమె… కారు హార్న్ కొడుతూ అతడిని వారించే ప్రయత్నం చేసింది.

అయినా, అతను పట్టించుకోకుండా, పని పూర్తి చేసేశాడు. కాగా నిందితుడు హార్న్ ఎందుకు అంతలా కొట్టావంటూ మోనాల్‌తో దూష‌ణ‌కి దిగాడు. అత‌డు మాట్లాడిన అస‌భ్య‌ప‌ద‌జాలాన్నిత‌న‌ఫోన్‌లో రికార్డు చేసిన న‌టి ఆ వీడియోని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఇది వైర‌ల్ కావ‌డంతో మ‌హిళ‌పై దూష‌ణ‌కి దిగినందుకు కమ్లేష్ ప‌టేల్ అనే వ్య‌క్తిపై కేసు న‌మోదు చేశారు పోలీసులు. మాల్ ఎదురుగా ఉన్న ప్రాంతంలో సదరు వ్యక్తి ఓ దుకాణాన్ని నిర్వహిస్తుంటాడని పోలీసులు తెలిపారు. గుజరాత్‌కు చెందిన మోనల్ గజ్జర్… టాలీవుడ్ లో ”వెన్నెల వన్ బై టూ’, ‘సుడిగాడు’, ‘బ్రదరాఫ్ బొమ్మాళి’ తదితర చిత్రాల్లో నటించింది.

 

మామాట: అంత అర్జెంట్ ఏమో…

English Summary: FIR lodged by Gajjar who also works in Telugu, Tamil, Malayam and Marathi films had gone to her cousin sister Payal’s beauty parlor located in a complex near Gulbai Tekra.

Leave a Reply