గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజీనామా

Share Icons:
  • రాజీనామా వెనుక కారణం వెల్లడించిన విజయ్ రూపానీ
  • గుజరాత్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం
  • గవర్నర్ కు రాజీనామా పత్రం
  • ప్రధాని మోడీకి కృతజ్నతలు

గుజరాత్ రాజకీయాల్లో విజయ్ రూపానీ సీఎం పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ కు అందించి  మీడియాతో మాట్లాడారు. తనకు అప్పజెప్పిన బాధ్యతలను నెరవేర్చానని,. ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం ఇచ్చినందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.

భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు వరుసగా రాజీనామా చేస్తున్నారు.  ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు త్రివేంద్ర సింగ్ రావత్, తీరత్ సింగ్ రాజీనామా చేశారు,  కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప రాజీనామా చేశారు.  తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ శనివారం రాజీనామా చేశారు. అసెంబ్లీ పదవీ కాలం మరో ఏడాది ఉండగానే కేబినెట్‌ను విరమించుకుంటున్నట్లు ప్రకటించారు.

మోదీకి అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్న విజయ్ రూపానీ రాజీనామా పై రాజకీయంగా అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మరో ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యం లో మరో ముఖ్యమంత్రిని నియమిస్తారా, .రాష్ట్రపతి పాలన సాగిస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మోదీ ప్రధానమంత్రిగా ఎన్నికైన అనంతరం గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా ఆనందిబెన్ పటేల్‌ను నియమించారు. అయితే రెండేళ్ల పదవీకాలం పూర్తవ్వగానే ఆమె పదవికి రాజీనామా చేశారు. 2016, ఆగస్టు 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ రూపానీ.. 2021 సెప్టెంబర్ 11న రాజీనామా ప్రకటించారు.

అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నది బీజేపీ అధిష్ఠానం సిద్ధాంతమని, అందుకు అనుగుణంగానే తాను రాజీనామా చేశానని రూపానీ వెల్లడించారు. భవిష్యత్తులో పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా, చిత్తశుద్ధితో నిర్వహిస్తానని,  వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా, కొత్త సీఎంతో ఎన్నికలకు వెళ్లాలన్నది బీజేపీ యోచన. నూతన ముఖ్యమంత్రి రేసులో మన్సుఖ్ మాండవీయ (ప్రస్తుత కేంద్రమంత్రి),నితిన్ పటేల్ (గుజరాత్ డిప్యూటీ సీఎం), ఆర్సీ ఫాల్దు (గుజరాత్ మంత్రి) ఉన్నారు.

కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply