రెండు శ్లాబులకు మారనున్నజీఎస్‌టీ ?

Share Icons:
బెంగళూరు సెప్టెంబరు 07,
రానున్న రోజుల్లో జీఎస్‌టీలో రెండు శ్లాబులను మాత్రమే ఉంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు బెంగళూరు జోన్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ట్యాక్సెస్‌ ఏకే జ్యోతిషి చెప్పారు.జీఎస్‌టీపై నిర్వహించిన ఓ వర్క్‌షాప్‌కు అతిథిగా విచ్చేసిన జ్యోతిషి మాట్లాడుతూ.. ‘జీఎస్‌టీలో ఎలాంటి గందరగోళం లేదు. తొలి రోజుల్లో జీఎస్‌టీపై పారిశ్రామిక వర్గాల్లో కొన్ని సందేహాలు రేకెత్తినప్పటికీ.. ఇప్పుడు అవన్నీ తొలగిపోయి వారు కూడా జీఎస్‌టీకి అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జీఎస్‌టీలో సున్నాతో కలిసి ఐదు శ్లాబులు ఉన్నాయి. రానున్న రోజుల్లో వీటిని రెండుకు తగ్గించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
అలా జరిగితే 90శాతం వస్తువులు 18శాతం శ్లాబు కిందకు వచ్చే అవకాశాలున్నాయి’ అని చెప్పుకొచ్చారు. దేశ ఆర్థికవ్యవస్థ చరిత్రలో కీలక సంస్కరణగా అభివర్ణిస్తూ గతేడాది జులై 1న వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)ను అమల్లోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీని కింద వస్తువులు, సేవలకు 0, 5, 12, 18, 28 శాతం శ్లాబులుగా పన్నులు విధిస్తున్నారు. అయితే పారిశ్రామిక వర్గాల నుంచి వస్తున్న డిమాండ్‌ మేరకు కేంద్రం ఈ శ్లాబులను తగ్గించే యోచనలో ఉన్నట్లు గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా దీనిపై ఆయన మరిన్ని వివరాలను వెల్లడించారు.
మామాట: అప్పటికైనా పన్నులు తగ్గుతాయా పెద్ద సారూ

Leave a Reply