జీఎస్టీపై కీలక నిర్ణయం: పలు వస్తువులపై ధరలు తగ్గింపు..

The GST is heavily relieved
Share Icons:

ముంబై: గోవా వేదికగా జరిగిన 37వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా పలు వస్తువులపై జీఎస్టీ తగ్గించారు. దీంతో చాలా వస్తువుల ధరలు తగ్గాయి. జీఎస్టీ తగ్గించిన సేవల్లో హోటల్ రూమ్  సేవలపై జీఎస్టీ భారీగా తగ్గించారు. ముఖ్యంగా హోటల్ గది అద్దె రూ. 7500 దాటిన గదులపై జీఎస్టీని 28 శాతం నుంచి 18శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. అలాగే రూ.1000 పైన ఉన్న హోటల్ గదులపై జీఎస్టీని పూర్తిగా ఎత్తేశారు. అలాగే ఇక హోటల్ టారిఫ్ రూ.1000 నుంచి రూ.7500 మధ్య ఉన్న హోటల్ గదులపై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే డైమండ్స్ పై 5 శాతం నుంచి 1.5 శాతం కు తగ్గించారు. ప్లాటినం దిగుమతి చేసుకొని వాటితో ఆభరణాలు రూపొందించి ఎగుమతి చేస్తే జీఎస్టీ నుంచి మినహాయింపు నిచ్చారు.

అటు మెరైన్ ఇంధనంపై జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. చింతపండుపై 5 శాతం ఉన్న జీఎస్టీని పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. వెట్ గ్రైండర్లపై ఉన్న 12 శాతం జీఎస్టీని 5 శాతం తగ్గిస్తున్నామని చెప్పారు. దిగుమతి చేసుకునే రక్షణరంగ ఉత్పత్తులకు 2024 వరకు పన్ను మినహాయింపు ఇస్తున్నామని, భారత్ లో జరిగే ఫిఫా అండర్-17 మహిళల వరల్డ్ కప్ నిర్వహణకు అవసరమయ్యే వస్తువులు, సేవలపై జీఎస్టీ మినహాయింపునివ్వాలని నిర్ణయించామని సీతారామన్ వివరించారు.

అలాగే ఔట్ డోర్ కేటరింగ్ పై విధించే జీఎస్టీ 18 శాతం నుంచి ఐదు శాతం తగ్గింపు. కెఫెన్ తో కూడిన బేవరేజస్ పై జీఎస్టీ 18 నుంచి 28 శాతానికి పెంచారు. అయితే సవరించిన జీఎస్టీ రేట్లు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఇదిలా ఉంటే జీఎస్టీ కింద పన్ను చెల్లింపునకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారి నుంచి ఆధార్ వివరాలను తప్పనిసరిగా సేకరించాలని నిర్ణయించారు. రీఫండ్ కోరేవారికి సైతం ఆధార్ అనుసంధానం తప్పనిసని చేయాలని యోచిస్తున్నారు. అంతేకాకుండా.. ఒక కంపెనీ తన డీలర్లకు ఇచ్చే అదనపు రాయితీలు జీఎస్టీకి లోబడి ఉంటాయంటూ ఈ ఏడాది జూన్‌లో ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది.

 

Leave a Reply