కోడెల నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు…బాబుకు మరో తలనొప్పి

Former Andhra Pradesh Speaker Kodela Siva Prasada Rao Commits Suicide
Share Icons:

గుంటూరు: స్థానిక సంస్థల ఎన్నికల వేళ దివంగత కోడెల శివప్రసాద్ నియోజకవర్గం సత్తెనపల్లి గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. కోడెల శివప్రసాదరావు మరణం తర్వాత అక్కడ నియోజకవర్గ ఇంఛార్జ్ పదవి ఖాళీగా ఉంది. ఈ పదవిని ఎవరికి కట్టబెట్టాలో అర్థంకాకపోవడంతో చంద్రబాబు కూడా అయోమయంలో ఉన్నారనే చెప్పాలి. ప్రధానంగా ఇద్దరు నేతలు ఈ నియోజకవర్గం కోసం పోటీపడుతున్నారు. వారిలో కోడెల వారసుడు శివరామ్.. రాయపాటి వారసుడు రంగబాబు. ఈ ఇద్దరు సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ కోసం రేసులో ఉన్నారు.

అటు కోడెల మరణం తర్వాత రంగబాబు మళ్లీ యాక్టివ్ అయ్యారు.. పదవి ఆశిస్తున్నారు. ఇటు కోడెల శివరామ్ కూడా సత్తెనపల్లిపైనే ఆశలు పెట్టుకున్నారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు.. అక్కడే పాగా వేయాలని భావిస్తున్నారు. నియోజకవర్గంలో తన అనుచర వర్గంతో సమావేశాలు నిర్వహించారు.

కోడెల, రాయపాటి వారసులు పోటీలో ఉండగానే స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఉన్నట్టుండి అనూహ్యంగా మరో సీనియర్ నేత కూడా సత్తెనపల్లిపై కన్నేశారు. ఆయనే ఎమ్మెల్సీ రామకృష్ణ.. రెండు రోజులుగా నియోజకవర్గంలోనే తిరుగుతున్నారు. ఓవైపు కోడెల శివరాం తన అనుచరులతో చర్చలు జరుపుతున్నారు.. స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల్ని ఖరారు చేసే పనిలో ఉన్నారు. కోడెల భవన్‌లో రెండు రోజులుగా సమావేశాలు జరుగుతున్నాయి. ఇటు పోటీగా ఎమ్మెల్సీ రామకృష్ణ ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు.. స్థానిక సంస్థల ఎన్నికలపైనే ఆయన కూడా చర్చించారు. సీట్లు కేటాయింపు అంశంపై ప్రధానంగా ఈ భేటీలో చర్చించారట. వీరిద్దరూ పోటాపోటీగా సమావేశాలు ఏర్పాటు చేయడం సత్తెనపల్లిలో టీడీపీకి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది.

ఇదిలా ఉంటే శివరామ్ వర్గానికి చెందిన కొందరు నేతలు, కార్యకర్తలు అధినేత చంద్రబాబును కలిశారు. శివరామ్‌ను నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ప్రకటించాలని కోరారు. ఇద్దరు నేతలు సత్తెనపల్లి కోసం పోటీపడుతుండటం ఇప్పుడు టీడీపీ ఆసక్తికరంగా మారింది. ఎన్నికల వ్యూహాలతో సమన్వయంతో ముందుకు సాగాల్సిన నేతలు ఇలా గ్రూపులుగా విడిపోయి అధికారపార్టీకి మరింత అవకాశం కలిపించటంపై కార్యకర్తల నుంచి ఆందోళన వ్యక్తమవుతుందట. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీకి తీవ్ర నష్టం తప్పదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

Leave a Reply