ఎన్నికలకు హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం గ్రీన్ సిగ్నల్.

Share Icons:
*ఏపీ ఎన్నికల పై సింగిల్ బెంచ్  తీర్పు రద్దు.    
*తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఫలితాలు ప్రకటించవద్దు.
*రేపు పరిషత్ ఎన్నికలు .కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశాలు.
ఏపీ ఎన్నికలపై హైకోర్టు సింగల్ బెంచ్ ఇచ్చిన స్టే ను రద్దుచేస్తూ ఎన్నికలు జరుపుకోవచ్చు అంటూ తీర్పు ఇచ్చింది . అయితే ఫలితాలు మాత్రం తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ప్రకటించవద్దని తీర్పులో కోర్ట్ పేర్కొన్నది . దీనికి సంబందించిన సింగిల్ బెంచ్ తీర్పులో ఉన్న అభ్యంతరాలను అక్కడే పరిష్కరించుకోవాలని కోరింది. ఈ తీర్పుతో ఎన్నికల ఉత్కంఠతకు తెరదించినట్లైంది . రేపు యధావిధిగా ఎన్నికలు జరిపేందుకు ఎన్నికలసంగం ఆగమేఘాలమీద ఉత్తర్వులు జారీచేసింది. అన్నిజిల్లాల కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఈ మేరకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది.
సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు పై హైకోర్టు లో ఈ రోజు వాడి వేడి వాదనలు జరిగాయి. ఇప్పటికే నామినేషన్లు వేసి ప్రచారం చేసుకొని , పోలింగ్ కు సిద్ధపడుతుండగా ఎన్నికలపై స్టే విధించడం పై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. దీనిపై ఎన్నికల సంఘం సింగిల్ బెంచ్ తీర్పు పై అభ్యతరం వ్యక్తం చేస్తూ డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేసింది. ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ పిటిషన్ వేసిన వ్యక్తి ఎక్కడ పోటీలో లేరని, రాజ్యాగంలో ఎక్కడ ఎన్నికలు ఇన్ని వారాల ముందు ఎన్నికల కోడ్ ఉండాలనే నిబంధన ఏమి లేదని వాదనలు వినిపించారు. పైగా ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న ఎన్నికలను జరిపేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైందని అన్నారు.
దీనిపై కోర్ట్ ఇచ్చిన తీర్పు తో విపక్షాలు కంగు తిన్నాయి. రేపు జరగనున్న ఎన్నికలకోసం యధావిధిగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలోని మొత్తం 513 జడ్పీటీసీ లకు , 7230 ఎంపీటీసీ లకు ఎన్నికలు జరగాల్సివుంది. వీటి కోసం జడ్పీటీసీలలో 2092 , ౧౯౦౦౨ ఎంపీటీసీలలో నామినేషన్లు వేశారు. 2 కోట్ల 82 లక్షల ,15 వేల 104 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిఉంది.
                                    -కె. రాంనారాయణ, జర్నలిస్ట్.

Leave a Reply