గ్రేటర్ ఎన్నికల నగారా మోగింది:

Share Icons:

గ్రేటర్ లో ఎన్నికల నగారా మోగింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలెక్షన్స్ 2020 షెడ్యూల్ ను తెలంగాణ ఎన్నికల కమిషనర్ ఆర్థసారధి మంగళవారం విడుదల చేసారు. బాలట్ పేపర్లు ఉపయోగించి గ్రేటర్ పరిధిలోని 150 దివిజన్లకు ఎన్నికలు నిరవహిస్తారు.   నామినేషన్లా దాఖలుకు వేయడానికి నవంబర్ 20,2020 చివరి తేదీ. జీహెచ్ఎంసీ పాలకవర్గం పదవీ కాలం 2021 ఫిబ్రవరి 10న ముగుస్తున్నది. 2016లో నిర్వహించిన వార్డులు, రిజవేషన్ల ప్రకారమే ప్రకారమే ఈసారి ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్ధపారథి తెలిపారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ  నవంబర్ 18న ప్రారంభిస్తారు. నవంబర్ 20వ తేదీన నామినేషన్ దాఖలుకు చివరి తేదీ. నామినేషన్ల పరిశీలన 21న పూర్తవుతుంది. నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 22. 22 వ తేదీ ఇండిపెండెంట్లకు గుర్తులు కేటాయిస్తారు. డిసెంబర్ 1వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. అవసరాన్ని బట్టి డిసెంబర్ 3న రీ పోలింగ్ నిర్స్తామని కమిషనర్ తెలిపారు.

2016 లొ జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టి ఆఎ వ్స్ 99 డివిజన్లలో, ఎం ఐ ఎం 44 డివిజన్లలో ఢంకా మోగించగా బిజెపి 4 డివిజన్లతో కాంగ్రెస్ 2 డివిజన్ళతో చతికిలబడ్డాయి. టిడిపి కేవల ఒంటికొమ్ము శొంఠి కాయలా ఒక్కటే దక్కింది. 2009 ఎన్నికలప్పుడు కాంగ్రెస్ కు 52, టిడిపి కి 45, ఎం ఐ ఎం కు 47, బిజెపి కి 4, ఇతరులకు 5 డివిజన్లు దక్కాయి
-నందిరాజు  .

Leave a Reply