మామాట లో మీమాట పోల్ నెం.10 – న్యాయ-కార్యనిర్వాక వ్య(అ)వస్థలు

Share Icons:

న్యాయ-కార్యనిర్వాక వ్య(అ)వస్థలు

న్యాయమూర్తుల ఎపికలో కొలీజియం సిఫార్సు తిరస్కరణ!

ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే తీరు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27:

[yop_poll id=”19″]

రాజకీయ వ్యవస్థ, న్యాయవ్యవస్థలు రాజ్యాంగంలో బలమైనవి. అన్నీ తామే అయి రాజ్యపాలనను నడపాల్సిన వ్యవస్థలు. వీటి మధ్య అప్పుడప్పుడు తగాదా వస్తుంటుంది. చాలా దేశాలలో వీటి కారణంగానే ప్రభుత్వం కూలిపోయాయి. కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. భారతదేశంలో ఆ పరిస్థితి దాపురించకపోయినా తమ పరిధులను దాటుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరస్పర సహకారం, రెండిటి మధ్య సమన్వయం ఎంత అవసరమో రాజ్యాంగం చెప్పకనే చెప్పింది. నియామకాలను, అమలు వరకూ ఒక్కొక్క దశలో ఒక్కోవ్యవస్థ కలుగజేసుకుంటుంది.

అది రాజ్యాంగం కల్పించిన అద్భుత అవకాశం. అయితే ఆ అవకాశాన్ని ఇతర వ్యవస్థలపై పట్టుసాధించడానికి వినియోగిస్తే, ఏమవుతుంది. రాజ్యాంగ స్పూర్తి, రాజ్యాంగ పటిష్టత దెబ్బతింటుంది. క్రమేణ రాజ్యవిచ్ఛిన్నతకు దారితీస్తాయి. సరిగ్గా అలాంటి వాటికి ఇక్కడ బీజం పడినట్లు కనిపిస్తోంది. న్యాయవ్యవస్థలో కలుగజేసుకోవడానికి రాజకీయ వ్యవస్థ ప్రయత్నం చేస్తోందనే పరిస్థితి కనికిపిస్తోంది. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నియామకంలో కొలీజియం సిఫారస్సులను పున:పరిశీలనకు పంపిన కేంద్ర న్యాయశాఖ కాస్త దుస్సాహసమే చేసింది. కాని వారిని పక్కన పెట్టే ప్రయత్నం చేసింది. ఇది ఒక కేంద్రంలోనే కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ జరిగినట్లు స్పష్టమవుతోంది. అదే ప్రస్తుతం గందరగోళానికి దారి తీసింది. అవేంటో చూద్దాం.

ఇందూమల్హోత్ర, జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌ పేర్లను సుప్రిం కోర్టు న్యాయ మూర్తులుగా నియమించడానికి కొలీజియం 2018 జనవరిలో సిఫార్సు చేసింది. ఇందులో ఇందూ మల్హోత్రా ప్రతిపాదనను సమర్థించింది. అయితే, జస్టిస్ కెఎం జోసెఫ్ పేరు ప్రతిపాదనను తప్పుబడుతూ, కేంద్ర న్యాయశాఖ కొలీజియం ప్రతిపాదనను పున:సమీక్షకు పంపింది. అందుకు సంబంధించి చాలా లెక్కలు చెప్పింది.

‘‘న్యాయమూర్తుల సీనియారిటీ ప్రకారం చూస్తే జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌ 42వ స్థానంలో ఉంటారు. ప్రస్తుతం వివిధ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులుగా సేవలందిస్తున్న 11 మంది ఆల్‌ ఇండియా హైకోర్టు న్యాయమూర్తులు సీనియారిటీ జాబితాలో ఈయనకంటే ముందు వరుసలో ఉన్నారనీ, తెలిపింది. కోల్‌కత్తా, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, ఝార్ఖండ్‌, జమ్మూ కశ్మీర్‌, ఉత్తరాఖండ్‌తోపాటు సిక్కిం, మణిపూర్‌, మేఘాలయ హైకోర్టులకు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ప్రాతినిధ్యం లేదనీ, జస్టిస్‌ జోసెఫ్‌ మాతృ హైకోర్టు కేరళ హైకోర్టు.

ఒకవేళ ఆయన్ను సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమిస్తే, కేరళ హైకోర్టు నుంచి ఇద్దరు సుప్రీం కోర్టుకు ప్రాతినిధ్యం వహించినట్లవుతుందనీ. దీర్ఘకాలంగా ఎస్సీ, ఎస్టీలకు సుప్రీం కోర్టులో ప్రాతినిధ్యం కొరవడిన విషయం ఇక్కడ గమనార్హమని ఎవేవో లెక్కలు చెప్పింది. వివిధ కోర్టుల్లో ఇంతకంటే సీనియర్‌ ప్రధాన న్యాయమూర్తులు, అర్హులైన సీనియర్లు ఉన్నప్పుడు ఈయన పేరును పరిగణనలోకి తీసుకోవడం న్యాయంకాదనీ, పున: పరిశీలనకు పంపింది.

అయితే కొలిజియం పంపిన సిఫారస్సును వేరు చేసి మల్హోత్రా నియామకానికి మాత్రమే రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఒక పేరును వెనక్కు పంపడాన్ని ప్రస్తుతం ప్రభుత్వం సమర్థించుకున్నా, ఇలా సిఫార్సులను ఒకదాని నుంచి మరొకటి ప్రభుత్వం వేరు చేయలేదని, 2014, జూన్‌లో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌.ఆర్‌.ఎం.లోధా ప్రభుత్వానికి రాసిన లేఖలో స్పష్టం చేయడం గమనార్హం.

కెఎం జోసెఫ్ పేరును ఎందుకు వెనక్కి పంపుతున్నామో తెలపడానికి ప్రభుత్వం అన్ని కారణాలు తెలిపింది. అయితే ఇక్కడ పున: పరిశీలనకు జాబితాను వెనక్కి పంపడంతో కేంద్రానికి అధికారం ఉందనే భావన వినిస్తోంది. అయితే అది సాంప్రదాయం మాత్రం కాదని అంటున్నారు. కేవలం ఇక్కడ 2016లో ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనను విధించడాన్ని తప్పుపడుతూ జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌ తీర్పు ఇవ్వడంవల్లే కేంద్ర ప్రభుత్వం ఆయన్ను సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి సుముఖత చూపడంలేదన్న ప్రచారం ఉంది.

వారు చెబుతున్న కారణాలన్నింటిని సుప్రిం కోర్టు చూసుకుని ఉండదా? ఆ వ్యవస్థలో న్యాయం చెప్పడానికి ఎవరుండాలి? అనే విషయం సుప్రిం కోర్టుకు కొలీజియంకు తెలియదా? అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతోంది. పున: పరిశీలన తరువాత కూడా కొలీజియం అదే పేరును పంపితే ఏం చేస్తారు? ఈ గందరగోళం ఇలా కొనసాగుతుండగా హైకోర్టు జడ్జీల నియాకంలో చంద్రబాబు కూడా ఇలాగే వ్యవహరించారనే ఆరోపణలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేపుతున్నాయి.

చంద్రబాబుది మరోతీరు కులప్రాతిపదిక ఎంపిక

సుప్రీం కోర్టు న్యాయమూర్తుల ఎంపిక విషయంలో కేంద్రం కలుగుజేసుకుంటోందనే విషయం రగుతుండగా చంద్రబాబు ప్రభుత్వం అందుకు తక్కువేమి కాదు. ఇప్పటికే బీసీ వర్గాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై మండిపడుతున్నాయి. టీడీపీకి వెన్నెముకలాంటి సామాజిక వర్గాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారని ఆ సామాజిక వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హైకోర్టు రిటైర్డు జడ్జి, జాతీయ బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య ఆధారాలతో సహా విషయాలను బహిర్గతం చేశారు.

సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల నియామకం జరిగినట్లే, హైకోర్టులో కూడా కొలిజీయం ద్వారానే నియామకం జరుగుతుంది. రాష్ట్రానికి చెందిన న్యాయవాదులు అమర్‌నాథ్‌ గౌడ్, అభినవ్‌కుమార్‌ చావలి, గంగారావు, డీవీ సోమయాజులు, విజయలక్ష్మి, కేశవరావులను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ సుప్రీంకోర్టు జడ్జిల కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఆ ఆరుగురిపై అభిప్రాయం చెప్పాలని రాష్ట్రాన్ని కేంద్ర న్యాయశాఖ కోరింది. మొదటి నుంచి జడ్జిల వ్యవహారంలో చంద్రబాబు వేలు పెడుతుంటాడు. తనకు అనుకూలమైన వారిని నియమించుకోవడానికి ప్రయత్నిస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం కూడా అదే జరిగినట్లుంది. తన సామాజిక వర్గానికి చెందిన వారిని మాత్రమే సిఫారస్సు చేసి మిగిలిన వారిపై ముద్రవేశారనే ఆరోపణలుున్నాయి.

బీసీ వర్గాలకు చెందిన అమర్‌నాథ్‌ గౌడ్, అభినవ్‌ కుమార్‌ చావలి, ఎస్సీ వర్గానికి చెందిన గంగారావు, బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన డీవీ సోమయాజులకు విషయ పరిజ్ఞానం లేదని.. వ్యక్తిత్వం లేదని.. సచ్ఛీలుకారంటూ మార్చి 21, 2017న సీఎం చంద్రబాబు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు లేఖ రాశారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన విజయలక్ష్మి, వెలమ వర్గానికి చెందిన కేశవరావులకు అనుకూలంగా నివేదిక పంపారు.

కానీ, కేంద్ర నిఘా వర్గాల ద్వారా ఆరుగురు న్యాయవాదులపై కేంద్రం ప్రత్యేకంగా నివేదిక తెప్పించుకుంది. ఆ మేరకు ఆరుగురిపై సానుకూలంగా నివేదిక రావడంతో కేంద్రం వారిని హైకోర్టు జడ్జిలు నియమించింది. ఇలా ఇచ్చిన లేఖను జస్టిస్ ఈశ్వరయ్య బయటపెట్టారు. దీనిని ఆయన తప్పుబట్టారు. తమ చేతిలో ఉంది కదాని ఇష్టానుసారం వ్యవహరించడాన్ని ఆయన నిలదీశారు. కేంద్రానికి సీఎం చంద్రబాబు రాసిన లేఖలను సోమవారం జస్టిస్‌ ఈశ్వరయ్య బయటపెట్టడం తీవ్ర సంచలనం రేపింది.

మామాట : ఏలికలు అస్మదీయులుకే పట్టంకట్టితే న్యాయం జరుగుతుందా?

English Summary :
The central government, which has refused to accept the Supreme Court’s collegium’s recommendations regarding the appointment of Justice KM Joseph to the apex court, has said doing so would distort the court’s regional representation.

2 Comments on “మామాట లో మీమాట పోల్ నెం.10 – న్యాయ-కార్యనిర్వాక వ్య(అ)వస్థలు”

Leave a Reply